EPAPER

Free Bus Scheme in AP: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునుంచేనా ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు..?

Free Bus Scheme in AP: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునుంచేనా ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు..?

Free Bus Scheme in Andhra Pradesh Start on Chandrababu Oath: దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం పథకం అమలవుతుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మహిళల నుంచి ఆదరణ లభిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ఈ విషయమై చర్చిస్తున్నారు. అయితే, ఏపీలో కూడా టీడీపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈ పథకం విషయమై భారీ చర్చ నడుస్తోంది. ఎప్పటినుంచి రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం అమలవుతుంది..? ఈ పథకాన్ని అమలు చేస్తే ఆటోవాలాలు, జీబ్ వాలాల పరిస్థితి ఏమిటి..? వారి నుంచి వ్యతిరేకత వస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నది…? అనే అంశాలపై చర్చిస్తున్నారు.


ఈనెల 12న చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రణాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో సహా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఫ్రీబస్సు అమలు పథకం గురించి తీపి కబురు చెప్పే అవకాశముంటుందా..? అని అక్కడి మహిళలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటా.

అయితే, ఫ్రీ బస్సు విషయమై ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ పథకాన్ని అమలు చేస్తే ఆర్టీసీపై ఎలాంటి ప్రభావం పడే అవకాశముంది..? పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలతోపాటు పలు ఇతర అంశాలపై కూడా చంద్రబాబు ఇప్పటికే చర్చలు జరిపారంటా. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోవాలాలు, జీబ్ వాలాల నుంచి వ్యతిరేకత ఎదురైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేదానిపై కూడా చర్చలు జరిపినట్లు సమాచారం.


Also Read: రామోజీరావు పాడి మోసిన చంద్రబాబు, ముగిసిన అంత్యక్రియలు

ఆటోవాలాలు, జీబ్ వాలాలకు ఏమైనా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపాధిని చూపెట్టగలం అనే అంశంపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు పెద్ద ఎత్తున జర్నీలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది..? ఆయా మార్గాలలో రద్దీకి తగ్గట్టుగా బస్సుల ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించారంటా. అదేవిధంగా తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఆధార్ కార్డ్ చూపితే బస్సులలో ఫ్రీ జర్నీకి అనుమతించే విధానంపై ఆలోచనలు చేస్తున్నారంటా.

ఇటు, ఇతర రాష్ట్రాలలో బస్సు ప్రయాణాలలో జరిగిన గొడవల పట్ల అప్రమత్తంగా ఉంటూ, అలాంటివి ఏపీలో జరగకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో విషయమేమంటే.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ఉచిత బస్సు పథకం అమల్లోకి తెస్తారంటూ కొంత ప్రచారం జరుగుతుంది. మరి ఎప్పటినుంచి ఫ్రీ బస్సు పథకం అమలవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×