EPAPER

Food Posion in Gurukula School: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఐదుగురి పరిస్థితి విషమం!

Food Posion in Gurukula School: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఐదుగురి పరిస్థితి విషమం!

Food Posion in Gurukula School: తిరుపతి జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ కారణంగా మొత్తం 110 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉండడంతో హుటాహుటిన నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


నాయుడుపేటలోని అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 11మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతోనే అస్వస్థతకు గురైనట్లు బాధిత విద్యార్థులు వెల్లడించారు. ఇందులో ఎక్కువ మందికి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వీరందరికీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్ కల్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డిలు ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అనంతరం విద్యార్థులతో ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే విషయాలను ఆరా తీశారు. అనంతరం మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.


నాయుడుపేటలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలీ బాల వీరాంజనేయస్వామి స్పందించారు. ఈ మేరకు ఆయన హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. కలెక్టర్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లి అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు.

Also Read: జగన్ ఇలాకాలో కల్లోలం సృష్టిస్తున్న.. వైసీపీ కబ్జా కహానీలు..

ఇదిలా ఉండగా, కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలంలో అతిసారం కలకలం రేపింది. సుంకేశ్వరి గ్రామంలో అతిసారతో దాదాపు 40మందికిపైగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఇందులో వాంతులు, విరేచనాలతో నాలుగేళ్ల బాలిక మృతి చెందింది.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×