EPAPER

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Food Checking Labs: ఏపీలో ఫుడ్ చెకింగ్ ల్యాబ్స్.. FSSAIతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం

Food Checking Labs in AP: గత వైసీపీ పాలనలో ఏపీలో ఆహార భద్రత, ప్రమాణాల విషయమై భారీగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. ఆహార భద్రత, ప్రమాణాల ర్యాంకును పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా ఆహార నాణ్యతను నిర్ధారించే ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం ఓ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది.


Also Read: ప్రధాని మోదీతో దీనిపైనే చర్చించా… ఆయన కూడా… : సీఎం చంద్రబాబు

కాగా, ఏపీలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం కూటమి ప్రభుత్వం.. ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI)తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీలో ఆహారం కల్తీపై పరీక్షలు చేసి నిర్ధారించేందుకు ల్యాబ్ లు ఏర్పాటు చేసేందుకు ఫుడ్ చెకింగ్ సంస్థ ఒప్పందంలో భాగంగా అంగీకరించింది. ఢిల్లీలోని ఎఫ్ఎస్ఎస్ఏఐ కేంద్ర కార్యాలయంలో ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే, ఈ ఒప్పందం ప్రకారం కర్నూలు, తిరుపతిలో ఆహార భద్రత, ప్రమాణాల నిర్ధారణ కోసం ప్రత్యేక ల్యాబ్ లను ఏర్పాటు చేయనున్నారు.


Also Read: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

ఇదిలా ఉంటే.. గత వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే ఆహార భద్రత, ప్రమాణాల్లో ఏపీ ర్యాంక్ దిగజారిందింటూ కూటమి నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గత వైసీపీ సర్కారు ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో ఏపీలో ఆహార భద్రత తనిఖీల కోసం స్పెషల్ ల్యాబ్ లను ఏర్పాటు చేసేందుకు ప్రముఖ ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో తొలుత 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. వీటితోపాటు 15 మొబైల్ ల్యాబ్ లను కూడా ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు కూటమి ప్రభుత్వంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేయనున్న ల్యాబ్ కు ఒక్కోదానికి రూ. 21 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. అదేవిధంగా విశాఖలో కూడా మైక్రో బయాలజీ ల్యాబ్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Related News

Crime News: అత్తా, కోడలి మధ్య గొడవ.. అలా కొరికేసిందేంటీ, దెబ్బకు ఊడిపడిందిగా..

Chandrababu: ప్రధాని మోదీతో దీనిపైనే చర్చించా… ఆయన కూడా… : సీఎం చంద్రబాబు

Anchor Shyamala: ‘జానీ’లు ఎక్కువయ్యారు.. ఎన్టీఆర్, చిరు, బాలయ్య, పవన్‌లను లాగిన శ్యామల

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

AP BJP: రాహుల్ కు స్వీట్స్ పంపిన ఏపీ బీజేపీ నేతలు.. కారణం ఇదే

Tirumala: తిరు వీధుల్లో భక్త ప్రవాహం.. దర్శనానికి ఎన్ని గంటలంటే?

×