EPAPER
Kirrak Couples Episode 1

Family Members In AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బావ బావమరిది, మామ అల్లుళ్లు

Family Members In AP Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బావ బావమరిది, మామ అల్లుళ్లు

Family Members Who are Won and Lost in Ap Elections 2024: ఏపీ ఎన్నికల్లో కూటమి దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలను టీడీపీ కూటమి గెలుచుకోవడంలో వైసీపీ నేతలు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం ఫ్యామిలీ పోలిటిక్స్ ఎక్కువగానే నడిచాయి. ఒక వైపు వైసీపీలోనూ.. మరోవైపు కూటమి లోనూ ఓకే కుటుంబానికి చెందిన పలువురు ఎన్నికల్లో పోటీకి దిగారు. వారిలో కొందరు గెలుపొందగా.. మరికొందరు పరాజయాన్ని మూటగట్టుకున్నారు.


గెలిచినవారు: బావ బావమరిది, మామ అల్లుళ్లు

ముందుగా గెలిచిన వారిలో బావ బావమరిది అయిన.. చంద్రబాబు, బాలయ్య ఉన్నారు. అలానే అక్కా తమ్ముళ్లు.. పురందేశ్వరి, బాలయ్య.. మామ అల్లుళ్లు.. బాలయ్య, లోకేష్, శ్రీభరత్.. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ అంతా ఓకే కుటుంబానికి చెందిన వారు కావడం హాట్ టాపిక్ అవుతోంది. అదే విధంగా తండ్రీ కొడుకులు.. పుట్టా సుధాకర్ యాదవ్, మహేష్ కుమార్ యాదవ్ అయితం ఈసారి బరిలో నిలిచి గెలుపొందారు. యనమల కూతురు దివ్య, ఇంకో కూతురి భర్త పుట్టా మహేష్‌ యాదవ్ కూడా విజయం సాధించారు.


బాబాయ్, అబ్బాయ్

బాబాయ్, అబ్బాయ్.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు విక్టరీ కొట్టారు. బావ బావమరిది. రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి వాసు గెలిచారు. భార్యాభర్తలైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి.. తండ్రీకొడుకులైన.. పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా విజయం సాధించారు. అన్నదమ్ములైన జగన్, అవినాష్‌రెడ్డి సైతం విక్టరీ సాధించారు.

Also Read: పేరు మార్చుకుంటా.. ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన

ఓడినవారు: తండ్రీ కొడుకులు

ఓడినవారిలో తండ్రీ కొడుకులు కారుమూరి నాగేశ్వర్‌రావు, సునీల్ కుమార్.. తండ్రీ కూతురు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు, మాడుగుల నుంచి అనురాధ ఉన్నారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరిలో రాజమోహన్ రెడ్డి.. అలానే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు.

అన్నదమ్ములు

అన్నదమ్ములు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్.. బొత్స సత్యనారాయణ, బొత్స అప్పలనాయుడుకి ఓటమి తప్పలేదు. బొత్స సత్యనారాయణ ఆయన సతీమణి ఝాన్సీ కూడా ఓడిపోయారు.

అలానే ఒకరు విజయం సాధించి.. మరొకరు ఓడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కేశినేని చిన్ని గెలవగా.. కేశినేని నాని ఓడిపోయారు. జగన్ విజయం సాధించగా.. షర్మిల ఓడారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోగా… కిషోర్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఇక సర్వేపల్లిలో గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరులో ఓడిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆత్మకూరులో ఓడిన మేకపాటి రాజమోహన్ రెడ్డి బంధువులే కావటం విశేషం.

Related News

Jagan clarification: మళ్లీ బెంగుళూరుకి జగన్.. పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Big Stories

×