EPAPER

Vidadala Rajini: విడదల రజిని అక్రమాలు.. బాబు సర్కార్ ఏం చేయబోతుంది?

Vidadala Rajini: విడదల రజిని అక్రమాలు.. బాబు సర్కార్ ఏం చేయబోతుంది?

Ex Minister Vidadala Rajini Illegal Corruptions: మొన్న జగనన్న కాలనీలు.. నిన్న క్రషర్ యజమానులు.. నేడు పాఠశాల ఉపాధ్యాయులు ఎవరు చూసినా కూడా ఆ జిల్లాలో ఆమె బాధితులే.. డైరెక్ట్ గా ఆమె ఎటాక్ చేయొచ్చు. లేకపోతే ఆమె పేరు చెప్పి మరొకరైనా బెదిరించవచ్చు. మంత్రి హోదాలో ఆమె చేసిన పెత్తనం, ఆమె టీమ్ చేసిన దౌర్జన్యాలతో వివిధ వర్గాల వారు తీవ్రంగా నష్టపోయారంట. ప్రభుత్వ, ప్రజల ధనాన్ని దోచుకోవటమే ఎజెండాగా ఆమె చెలరేగారని అంటున్నారు ఫిర్యాదుదారులు.. అసలింతకీ ఎవరా లేడీ బాస్? ఆమె దౌర్జన్యాలపై వెలుగు చూస్తున్న వాస్తవాలేంటి?


వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలన ఎంత నిర్లక్ష్యంగా, దౌర్జన్యపూరితంగా సాగిందో చెప్పటానికి ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. రాష్ట్ర నలుమూలల్లో ప్రజలు ఆ పార్టీ అభ్యర్ధులను చిత్తుచిత్తుగా ఓడించారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఇష్టానుసారం అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ప్రజలకు మంచి చేస్తారని ఆలోచనతో ఓటు వేసి ప్రజాప్రతినిధులను గెలిపించుకుంటారు ప్రజలు.. కానీ వైసీపీ(YCP) ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి సొంత ఇల్లు చక్కదిద్దుకోవడానికే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో పల్నాడు జిల్లాలో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలే నిదర్శనమని చెప్పాలి.

గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడుదల రజనికి సంబంధించి వెలుగులోకి వస్తున్న కేసులను పరిశీలిస్తే ప్రతి ఒక్కళ్ళు ముక్కున వేలు వేసుకోవాల్సిందే.. రైతుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ వదిలిపెట్ట లేదంట మన మాజీ మంత్రి. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే రజిని( Vidadala Rajini )పెత్తనం మొదలైందంటారు. ఇక మూడేళ్ల తర్వాత ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యేని మంత్రిని చేశారు జగన్(Jagan) .. ఇక అప్పటి నుంచి లేడీబాస్ తరహాలో చెలరేగిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ఆఖరికి ప్రభుత్వ పాఠశాల పనుల్లో కూడా రజని వర్గం అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.. ఆమే కాదు రజని బంధువులు, అనుచరులు, తెలిసిన వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు ఆమె పేరు చెప్పి అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. జగనన్న కాలనీల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడంతో.. ప్రభుత్వం మారగానే బాధితులు బయటికి వచ్చి ఆమెపై ఫిర్యాదులు చేశారు.. దీంతో చేసేదేమీ లేక వారికి రజనీ వర్గీయులు డబ్బు తిరిగిచ్చారు.

Also Read:  అసలు ఎవరు ఈ జాయ్ జెమిమా? ఆమె ఉచ్చులో పడే మగాళ్లను ఏం చేస్తోంది?

వారిది ముగిసింది అనుకునే లోపే స్టోన్ క్రషర్స్ యజమానులు తమ నుంచి కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో విడుదల రజనీ( Vidadala Rajini )కి సంబంధించి మరో అక్రమం బయటకు వచ్చింది. ప్రస్తుతం స్కూలు రెన్యువేషన్ కి సంబంధించి చేపట్టే నాడు నేడు కార్యక్రమంలో పెద్ద ఎత్తున అక్రమం జరిగిందని.. దానికి కారణం విడుదల రజనీకి సంబంధించిన బంధువులేనని ప్రధాన ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయులు బయటికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాడు నేడు పనుల కోసం విడుదలై నిధుల్లో 40 లక్షల రుపాయలు దుర్వినియోగమయ్యాయని వారు చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం బయటకు వస్తున్న ఫిర్యాదులను బట్టి రజని ఏ స్థాయిలో అధికారం చెలాయించారో అర్థమవుతుంది.. తనకు అనుకూలురైన అధికారుల్ని నియమించుకుని.. తన మాట వినని వారిని బదిలీ చేయించి.. తన మాటే శాసనం అన్నట్లు వ్యవహరించేవారని బాధితులు అంటున్నారు .. వైసీపీ ప్రభుత్వంలోనూ విడుదల రజనీఫై పలు ఫిర్యాదులు చేసినా అవన్నీ బుట్టదాఖలు అయ్యాయంటున్నారు .. అప్పుడు నిస్సహాయంగా ఉండిపోయిన బాధితులంతా ఇప్పుడు బయటకు వస్తూ ఆమె ముఠా అక్రమాలను బయట పెడుతున్నారు. ఇవే కాదు భయపడి బయటికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారంటున్నారు.

రజిని అన్ని అక్రమాలకు పాల్పడబట్టే చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమెపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఆ విషయం సర్వేల్లో తేలడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆమెను గుంటూరు వెస్ట్ ఇన్చార్జ్‌గా పంపించారు. గుంటూరు వెస్ట్‌లో గెలవడానికి రజని ఘనంగానే ఖర్చు పెట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ(TDP) నుంచి పోటీ చేసిన గల్లా మాధవి రాజకీయాలకు కొత్త అయినప్పటికి రజని 51 వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత రజని వైసీపీ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించడం లేదు. వరుసగా తనపై వస్తున్న ఫిర్యాదులతో మీడియాకు, జనానికి ముఖం చూపించడమే మానేశారు. దాంతో వైసీపీ వర్గాలే ఆమెపై భగ్గు మంటున్నాయి.

విడుదల రజిని( Vidadala Rajini )పై వస్తున్న ఫిర్యాదులకు సంబంధించి పార్టీ వర్గాలు సైతం ఎక్కడా ఖండిస్తున్న పరిస్థితి లేదు కనీసం ఆమె చుట్టూ ఉన్న కార్యకర్తలు కూడా ఇప్పటివరకు దీనిపైన ఎక్కడ మాట్లాడిన పరిస్థితులు లేవు.. అయితే ఫిర్యాదులు అయితే అందుతున్నాయి కానీ.. వాటిపై ఇంత వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం విమర్శల పాలవుతుంది. మరి కూటమి సర్కారు ఆవిమర్శలకు ఎలా రిప్లై ఇస్తుందో చూడాలి.

Related News

Amrapali Kata IAS : సీఎం చంద్రబాబును కలిసిన ఆ నలుగురు ఐఏఎస్లు, ఆమ్రపాలికి ఏ శాఖ ఇవ్వనున్నారంటే ?

CM Chandrababu : సజ్జల జస్ట్ శాంపిల్, నెక్ట్స్ ఎవరు.. వైసీపీని వణికిస్తున్న బాబు మాస్టర్ ప్లాన్

Bigtv Free Medical Camp: కనీసం రవాణా సదుపాయం కూడా లేని గ్రామంలో.. బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంపు

YS Jagan: దోచుకో.. పంచుకో.. తినుకో.. అంతా మాఫియా మయం.. కూటమిపై జగన్ సెటైర్స్

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

YS Sharmila: ఆర్టీసీ బస్సెక్కిన వైయస్ షర్మిళ.. కండక్టర్ కు ప్రశ్నల వర్షం.. అంత మాట అనేశారేంటి ?

Tension In YCP Leaders: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. పొంతన లేని సమాధానాలు, సీఐడీకి ఇచ్చే ఛాన్స్

Big Stories

×