EPAPER

New Police Officers in AP: ఏపీలో కొత్త డీఎస్పీల నియామకం.. సస్పెండెడ్ పోస్టుల్లో భర్తీ!

New Police Officers in AP: ఏపీలో కొత్త డీఎస్పీల నియామకం.. సస్పెండెడ్ పోస్టుల్లో భర్తీ!

EC Appointed New Police Officers on the Place of Suspended in AP: ఏపీలో ఇటీవలే ఎన్నికల పోలింగ్ పూర్తవ్వగా.. ఆ తర్వాతే కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసులను ఆ హింసకు బాధ్యుల్ని చేస్తూ.. వారందరిపై సస్పెన్షన్ వేటు వేసింది ఈసీ. సస్పెండైన అధికారుల స్థానంలో డీఎస్పీలను నియమించింది. నరసరావు పేట ఎస్డీపీఓ(దిశ) గా ఎం సుధాకర్ రావును, గురజాల ఎస్డీపీఓ(ఏసీబీ)గా సీహెచ్ శ్రీనివాసరావును, తిరుపతి ఎస్డీపీఓ(ఏసీబీ)గా కె. రవి మనోహరా చారి, తాడిపత్రి ఎస్డీపీఓ(SEB)గా కె. జనార్థన్ నాయుడు, తిరుపతి SB(ACB)గా ఎం. వెంకటాద్రిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


అలాగే.. తిరుపతి ఎస్బీ డీఎస్పీగా ఎం. వెంకటాద్రి, అలిపిరి సీఐగా రామారావు, తిరుపతి సీఐగా విశ్వనాథ చౌదరిలను నియమించింది. తాడిపత్రి టౌన్ సీఐగా నాగేంద్రప్రసాద్ కు పోస్టింగ్ ఇచ్చింది. ఏపీలో ఇటీవలే ఆయా ప్రాంతాల్లో హింస చెలరేగగా.. అల్లర్లను కట్టడి చేయడంలో పోలీసు ఉన్నతాధికారులు విఫలమయ్యారని ఈసీ వారందరిపై వేటు వేసింది. ఇప్పుడు వారి స్థానంలోనే డీఎస్పీలను నియమించింది.

Also Read: సిట్ నివేదికలో కీలకాంశాలు, సాయంత్రం..


ఇదిలా ఉండగా.. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా జూన్ 4న వెల్లడి కానున్నాయి. హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల్లో ఈసీ రెండ్రోజుల ముందు నుంచే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది. తాజాగా.. ఇంటెలిజెన్స్ వర్గాలు ఈసీకి మరో నివేదికను ఇచ్చాయి. కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో పోలింగ్ రోజున దాడులు జరిగే అవకాశం ఉందన్నది ఆ నివేదిక సారాంశం. ఇంటెలిజెన్స్ హెచ్చరికతో.. ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేటపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. పోలింగ్ సమయంలో గొడవలు చేసిన వ్యక్తులపై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించింది.

Related News

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Big Stories

×