BigTV English

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!

YSRCP : పార్టీకి జగన్‌ శాశ్వత అధ్యక్షుడు కాదా..? కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ..!


YSRCP latest news(AP political news) : తమ పార్టీకి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ తమకు తెలియజేసిందని కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎంపీ రఘురామకృష్ణరాజుకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొంది. పార్టీ పేరు సవరణ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌కు శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రెడ్డిని ఎన్నుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పార్టీ వైపు నుంచి ఎలాంటి ప్రకటన అధికారికంగా చేయలేదు.

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ లేఖకు కేంద్రం ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. వైసీపీ ఇచ్చిన సమాచారాన్ని లేఖ ద్వారా రఘురామకృష్ణరాజుకు పంపింది. అలాగే పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ లేదా వైఎస్ఆర్ సీపీ మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ వివరించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×