EPAPER

Bird Flu in Andhra Pradesh: చికెన్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మరో 3 నెలల వరకు నో చికెన్..!

Bird Flu in Andhra Pradesh: చికెన్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మరో 3 నెలల వరకు నో చికెన్..!

Bird Flu in Andhra Pradesh: చికెన్ లేకపోతే.. సండే ఎంజాయ్ మెంట్ ఉండదు. కానీ ఈసారి చికెన్ లేకుండానే సండే వెళ్లిపోయింది. అందుకు కారణమేంటో మీకు తెలుసు. బర్డ్ ఫ్లూ కారణంగా వేలసంఖ్యలో కోళ్లు చనిపోవడంతో నెల్లూరుజిల్లాలో మూడ్రోజులు చికెన్ షాపులను క్లోజ్ చేయించారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా చికెన్ అమ్మితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.


ఒక్క సండేనే కాదు.. వారంలో మిగతా రోజుల్లోనూ చికెన్ తినే వారికి ఇప్పుడు పెద్దకష్టమే వచ్చింది. నాన్ వెజ్ వంటల్లో చికెన్ ముందుంటుంది. ఇప్పుడు మాత్రం చికెన్ లేకుండానే.. వంటలు చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు. కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వేలసంఖ్యలో కోళ్లు మృతి చెందడానికి కారణం.. బర్డ్ ఫ్లూ అని తెలియడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది.

Read More: విశాఖ బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. పర్యాటకులకు అద్భుత అనుభవం..!


అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశారు.ఏపీ పశువర్థనశాఖకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. బర్డ్ ఫ్లూ వైరస్ ఇతర జిల్లాలకు కూడా వ్యాపించకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 7 నుంచి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పటివరకూ సుమారు 10 వేల పౌల్ట్రీపక్షులు వ్యాధికారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మూడురోజులు కాదు.. మరో మూడు నెలల వరకూ చికెన్ జోలికి వెళ్లకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకూ జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు కానీ.. జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరాలని సూచించారు. సాధారణ జ్వరమే కదా.. తగ్గిపోతుందని నిర్లక్ష్యం చేయరాదని తెలిపారు.

బర్డ్‌ఫ్లూ దెబ్బకి బ్రాయిలర్‌ కోడిని కొనేందుకు, తినేందుకు జనం జంకుతుండటంతో అమాంతం దాని ధర పడిపోయింది. ఇదే సమయంలో నాన్‌వెజ్‌ ప్రియులు మటన్‌, చేపలను తినడానికి మక్కువ చూపడంతో వాటి విక్రయాలు పెరిగాయి. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్‌ షాపులు మూతపడ్డాయి. దీంతో చికెన్‌ సెంటర్లు వెలవెలబోగా.. వ్యాపారం లేక డీలా పడ్డారు చికెన్‌ సెంటర్‌ యజమానులు. అలాగే వందలాది కోళ్లు బర్డ్‌ఫ్లూ మృత్యవాత పడటంతో పెంపకదారులు తీవ్రంగా నష్టపోయి లబోదిబోమంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×