EPAPER

Paritala Family Tickets : వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ పాలసీ.. పరిటాల ఫ్యామిలీకి వర్తిస్తుందా ?

Paritala Family Tickets : వన్ ఫ్యామిలీ.. వన్ టికెట్ పాలసీ.. పరిటాల ఫ్యామిలీకి వర్తిస్తుందా ?

Paritala Family Tickets : ఇప్పుడు ఆ ఉమ్మడి జిల్లాల్లో ఒకటే చర్చ సాగుతోంది. చర్చంత ఆ ఫ్యామిలీ గురించే.. ఆ కుటుంబానికి ఎన్ని టిక్కెట్స్ దక్కుతాయి. ఒకటా రెండా అన్న కన్ఫ్యూజన్ ఇటు ఆ ఫ్యామిలీ లోనూ, అటు క్యాడర్‌లోనూ కనిపిస్తోంది. ఇక అన్ని రాజకీయ పార్టీల్లోనూ వారికి సంబంధించిన చర్చ జరుగుతుండటం విశేషం. అయితే ఇప్పటి వరకు ఏనాడూ రెండు టికెట్లు ఆశించని ఆ కుటుంబసభ్యులు.. ఈ సారి మాత్రం రెండు సెగ్మెంట్లలో ప్రచారం చేసుకుంటూ.. టికెట్‌పై ధీమాతో కనిపిస్తున్నారు. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏదో? అసలా జిల్లా ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా?


అనంతపురం జిల్లా టీడీపీలో పరిటాల ఫ్యామిలీ ప్రాబల్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు కనిపిస్తారు ఆ కుటుంబానికి.. తెలుగు దేశం పార్టీతో దివంగత పరిటాల రవి కుటుంబానికి మూడు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది. అలాంటి ఫ్యామిలీ పొలిటికల్ కెరీర్‌కు సంబంధించి.. ఇప్పుడు తీవ్ర కన్‌ఫ్యూజన్ కనిపిస్తోందంటున్నారు.

పరిటాల దంపతుల వారసుడు పరిటాల శ్రీరామ్ గత ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. అప్పటి నుంచి రాప్టాడు టీడీపీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. రాప్తాడు‌లో కార్యకర్తలకు అండగా ఉన్నారు. ఆ టైంలోనే ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి బిజెపిలో చేరడంతో ధర్మవరం‌లో టీడీపీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ దశలోలో పరిటాల కుటుంబానికి ధర్మవరం ఇన్‌చార్జ్ బాధ్యతలు కూడా కట్టబెట్టారు చంద్రబాబు.


ధర్మవరం ప్రాంతం ఆ కుటుంబానికి కొత్త కాకపోయినా.. శ్రీరామ్‌కు కొత్త కావడంతో మొదటి నుంచి కార్యకర్తలను పరిచయం చేసుకుంటూ పార్టీని బలోపేతం దిశగా దూసుకుపోతున్నారు. ధర్మవరం తమ్ముళ్లకు భరోసా ఇస్తూ.. సమస్యలపై పోరాడుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ధర్మవరంలో సక్సెస్ చేసిన సందర్భంగా.. లోకేశ్ ఆయన్ని ధర్మవరం అభ్యర్ధిగా ప్రకటించారు. అక్కడే టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు. టికెట్ కన్ఫర్మ్ అయింది అనుకున్న తరుణంలో.. పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబాన్ని ఒకటే టికెట్ అన్న పాలసీని ఎత్తుకున్నట్లు ప్రచారం మొదలైంది.

కుటుంబానికి ఒకే టికెట్ పాలసీపై.. మిగతా రాజకీయ కుటుంబాలు ఏమనుకుంటున్నా.. పరిటాల ఫ్యామిలీకి కానీ.. వారి అభిమానులకు కానీ అసలు రుచించడం లేదంట. జిల్లాలో ముందు నుంచి పార్టీ శ్రేణులకు పరిటాల ఫ్యామిలీ అండగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా 2004లో వైఎస్ వేవ్ ఉన్నా.. పరిటాల రవి చరిష్మాతో ఉమ్మడి జిల్లాల్లో ఆరు సీట్లు గెలుచుకోగలిగింది టీడీపీ. ఇక ఆ ఫ్యామిలీ కూడా రాజకీయాల్లో ఎప్పుడూ రెండు సీట్లు కోరుకోలేదు. పరిటాల రవి ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత సునీత రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా ఒకటే సీటు నుంచి పోటీ చేసి.. 2019 వరకూ గెలుస్తూ వచ్చార.

పరిటాల సునీత కూడా రాప్తాడు లాంటి అతి కష్టమైన స్థానం నుంచి రెండుసార్లు 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వారెప్పుడూ రెండు సీట్ల కోసం ప్రయత్నించిన దాఖలాలు కూడా లేదు. 2019లో కూడా సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి హవాలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో శ్రీరామ్ తల్లి, మాజీ మంత్రి పరిటాల సునీత ప్రచారానికే పరిమితం అయ్యారు.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ధర్మవరం నేత వరదాపురం సూరి టిడిపి‌కి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో అసలు కథ మొదలైంది.. అంతవరకు రాప్తాడుని నమ్ముకుని ఉన్న పరిటాల శ్రీరామ్ ధర్మవరంకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దాంతో అటు ధర్మవరం‌లో పరిటాల శ్రీరామ్, ఇటు రాప్తాడులో పరిటాల సునీత పార్టీ బాధ్యతలుచూసుకుంటూ.. కార్యకర్తలకు అండగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మరింత కష్టపడి తిరుగుతున్నారు. దాంతో రానున్న ఎన్నికల్లో తల్లీకొడుకులు ఇద్దరూ పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు.

ఇలాంటి పరిస్థితుల్లో.. వన్ ఫ్యామిలీ వన్ టికెట్ పాలసీపై మొదలైన ప్రచారం ఆ కుటుంబంతో పాటు.. వారి అనుచరులను, టీడీపీ శ్రేణులను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేస్తోందంట. పరిటాల అభిమానులైతే తెగ టెన్షన్ పడిపోతున్నారంట.. ఆ పాలసీ ఇది పరిటాల కుటుంబానికి కూడా వర్తిస్తుందా? లేకపోతే వారి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిసిందే కాబట్టి.. వెసులుబాటు కల్పిస్తారా? లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే శ్రీరామ్‌, సునీతలు మాత్రం ఇటు ధర్మవరం, అటు రాప్తాడులో ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. రెండు చోట్ల పోటీపై తల్లి , కొడుకు ఎంతో ధీమాగా కనిపిస్తున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.

.

.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×