EPAPER

Cm jagan: సీఎం జగన్ కాన్వాయ్‌పై దాడి.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..

Cm jagan: పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ..సీఎం జగన్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా వెలుగులోకి వచ్చింది. సీఎం జగన్‌ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 24న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గోని సమీపంలోని హెలిప్యాడ్‌కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్‌పైకి గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కారుపై పడింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

Cm jagan: సీఎం జగన్ కాన్వాయ్‌పై దాడి.. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన..
CM Jagan latest news

CM Jagan latest news(AP breaking news today):

పులివెందుల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి .. సీఎం జగన్‌ కాన్వాయ్‌పై రాయి విసిరిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, వైసీపీ నేతలు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయగా బాధితుడి ద్వారా వెలుగులోకి వచ్చింది.


సీఎం జగన్‌ ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవానికి ఈ నెల 24న పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని సమీపంలోని హెలిప్యాడ్‌కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో సీఎం కాన్వాయ్‌పైకి గురిజాల గ్రామానికి చెందిన అప్పయ్య రాయి విసిరారు. అది ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కారుపై పడింది. వెంటనే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

అదుపులోకి తీసుకున్న తర్వాత రెండు రోజులపాటు అప్పయ్యని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తపడ్డారు. చివరకు వైసీపీ నేతలు ఈ విషయంపై జోక్యం చేసుకుని అప్పయ్యను విడిపించారు. దివ్యాంగుడైన అప్పయ్య పెన్షన్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడిచినా పింఛను మంజూరు కాకపోవడంతో విసుగు చెంది సీఎం కాన్వాయ్‌పైకి రాయి విసిరినట్లు తెలిసింది. ఈ వ్యవహారం బుధవారం వెలుగులోకి వచ్చింది.


Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×