EPAPER

Dhone Assembly Constituency : డోన్ ఎవరికి డెన్.. ? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?

Dhone Assembly Constituency : డోన్ ఎవరికి డెన్.. ? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతోంది..?
Dhone Assembly Constituency

Dhone Assembly Constituency : డోన్‌ నియోజకవర్గం… ఉమ్మడి ఏపీకి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ప్రాంతం. నీలం సంజీవ రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి.. ఇద్దరు దిగ్గజ నేతలు ఇక్కడి నుంచి గెలిచి రాష్ట్రాన్ని పాలించిన వారే. ఈ నియోజకవర్గంలో కంబాలపాడు ఈడిగ, కోట్ల కుటుంబాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక్కడ పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఏడు సార్లు కేఈ కుటుంబ సభ్యులే గెలిచారు. ఇదంతా గతం. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటలాంటిది. ఇక్కడి నుంచి గెలిచిన బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచిన ఆయన.. ఇప్పుడు హ్యాట్రిక్‌పై గురి పెట్టారు. అయితే అదంతా సులువుగా కనిపించడం లేదు. బుగ్గన తీరుపై నియోజకవర్గ ప్రజలు అసంతృప్తితో ఉండటంతో పాటు.. ఆయన అనుచరులు కబ్జాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు టీడీపీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి బరిలో దిగబోతున్నారు. ఎన్నికలు మరో రెండేళ్లు ఉన్నాయన్న సమయంలోనే సుబ్బారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఆయన విస్తృత్తంగా పర్యటిస్తూ.. తన బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయి? ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఎవరి బలాబలాలేంటి? అన్న దానిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ ఎలక్షన్‌ సర్వే నిర్వహించింది. ఆ వివరాలను పరిశీలించే ముందు 2019 ఎన్నికల ఫలితాలను చూద్దాం.


2019 RESULTS

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (గెలుపు) vs కేఈ ప్రతాప్


YCP 58%
TDP 38%
OTHERS 4%

2019 ఎన్నికల్లో డోన్‌లో విజయఢంకా మోగించింది వైసీపీ. ఏకంగా 58 శాతం ఓట్లను సాధించి ఘన విజయం సాధించారు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి. ప్రత్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ కేవలం 38 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. దీంతో 20 శాతం ఓట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టారు బుగ్గన. ఇక ఈ ఎన్నికల్లో సీసీఐ తరపున పోటీ చేసిన కే రామాంజనేయులుకు కేవలం ఒక శాతం ఓట్లు మాత్రమే లభించాయి. అయితే ఈ గెలుపుకు అనేక కారణాలు తోడయ్యాయనే చెప్పాలి. మాములుగానే ఈ నియోజకవర్గంలో వైసీపీ చాలా బలంగా ఉంది. దీనికి తోడు వైఎస్‌ జగన్ వేవ్‌తో పాటు.. బుగ్గన పాజిటివ్ ఇమేజ్‌ బాగా కలిసి వచ్చింది. దీంతో ఓటర్లు భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించారు. మరి ఈ సారి ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (YCP)

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్లస్ పాయింట్స్

  • వరుసగా రెండు సార్లు గెలవడం
  • ప్రజల్లో ఉన్న పాజిటివ్ ఇమేజ్
  • క్యాడర్ పూర్తిగా సహకరించడం
  • గ్రౌండ్‌ లెవల్‌లో ఉధృతంగా ప్రచారం చేయడం
  • నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులు

బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మైనస్ పాయింట్స్

  • వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడం
  • మంత్రిగా బాధ్యతలు చేపట్టాక నియోజకవర్గానికి కాస్త దూరమవ్వడం

ధర్మవరం సుబ్బారెడ్డి (TDP)

ధర్మవరం సుబ్బారెడ్డి ప్లస్ పాయింట్స్

  • ముందుగానే టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం
  • విస్తృతంగా ప్రచారం నిర్వహించడం
  • నియోజకవర్గంలో గుర్తింపు ఉన్న నేత
  • నియోజకవర్గంలో బలంగా టీడీపీ క్యాడర్

ధర్మవరం సుబ్బారెడ్డి మైనస్ పాయింట్స్

  • పార్టీలు మారుతారనే ప్రచారం
  • అభ్యర్థిని మార్చుతారన్న ప్రచారం
  • పూర్తిగా సహకరించని కేఈ ప్రభాకర్‌ వర్గం
  • పార్టీలో అంతర్గత కుమ్ములాటలు

ఇక వచ్చే ఎన్నికల్లో డోన్‌ బరిలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (YCP) vs ధర్మవరం సుబ్బారెడ్డి (TDP)

YCP 51%
TDP 44%
OTHERS 5%

ఇప్పటికిప్పుడు డోన్‌లో ఎన్నికలు జరిగితే వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్‌కు 51 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని బిగ్‌ టీవీ ఎలక్షన్ సర్వేలో తేలింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డి పోటీ చేస్తే ఆయనకు 44 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలింది. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుత ఎమ్మెల్యే పాజిటివ్ ఇమేజ్‌ ఆయన గెలుపు అవకాశాలను పెంచుతోందని బిగ్ టీవీ సర్వేలో తేలింది. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధిపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. దీనికి తోడు అమ్మ ఒడి, నాడు-నేడు, జగనన్న తోడు, పెళ్లి కానుక లాంటి సంక్షేమ పథకాలు ఆయన గెలుపు అవకాశాలను మరింత పెంచుతున్నాయి. దీనికి తోడు నియోజకవర్గంలో బలంగా ఉన్న వైసీపీ క్యాడర్.. చేస్తున్న విస్తృత ప్రచారం కలిసి వచ్చే అంశం. అయితే టీడీపీలో ఉన్న అంతర్గత విబేధాలు కూడా వైసీపీకి కలిసి వస్తున్నాయి. సుబ్బారెడ్డి వర్గం, కేఈ ప్రభాకర్ వర్గాల పరస్పర వైరం.. వైసీపీకి అనుకూలంగా మారుతోందని బిగ్ టీవీ సర్వేలో తేలింది.

ఇక ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న సాంప్రదాయ ఓటర్లు పార్టీకి బలంగా మద్ధతిస్తున్నారు. సుబ్బారెడ్డిని ఎన్నికలకు చాలా కాలం ముందే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వనున్నాయి. క్యాడర్‌లో ఎక్కువ శాతం మంది సుబ్బారెడ్డికి అనుకూలంగా ఉన్నారు. దీనికి తోడు ఇటీవల కాలంలో చంద్రబాబు, నారా లోకేష్‌ నియోజకవర్గంలో చేసిన పర్యటనలు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాయి. అయితే సుబ్బారెడ్డితో పాటు కేఈ ప్రభాకర్ కూడా టికెట్ రేస్‌లో ఉండటం ఆ పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీచేలా చేస్తున్నాయి. అయితే బుగ్గనతో పోల్చితే సుబ్బారెడ్డి అంత చరిష్మా ఉన్న నేతగా ప్రజల్లో గుర్తింపు దక్కలేదని బిగ్‌ టీవీ సర్వేలో తేలింది. అంతేగాకుండా ముఖ్య నేతలకు ఆయన సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న ప్రచారం కూడా ఉంది.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×