EPAPER

First Official Trip of Pawan: పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి

First Official Trip of Pawan: పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి

First Official Trip of Pawan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి అధికారిక పర్యటన ఖరారైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఈనెల 19న పవన్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ సమీక్షకు హాజరుకానున్నారు.


ఎట్టకేలకు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి అధికారిక పర్యటన షెడ్యూల్ ఖరారై నట్లు తెలుస్తోంది. ఈనెల 19న హస్తినకు వెళ్లనున్నారు. కేంద్ర జల శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగే జల్ జీవన్ మిషన్ సమీక్షకు హాజరుకానున్నారు పంచాయతీ‌రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్. ఈ సమావేశంలో ఏపీలోని పరిస్థితులను ఆయన వివరించే ఛాన్స్ ఉంది.

ఈ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్రమోదీతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే ఛాన్స్ ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌కు ముందు కావడంతో పనిలోపనిగా ప్రధానిని కలిసి రాష్ట్రానికి నిధులను రాబట్టుకోవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.


రెండురోజుల కిందట మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఎన్నికల్లో గెలుపొందిన నేతలను పవన్ కల్యాణ్ సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈసారి ప్రధాని నరేంద్రమోదీ వద్దకు వెళ్తానని, ఏపీ సమస్యలను వివరించడమే కాదు.. రైల్వే‌జోన్, స్టీల్‌ప్లాంట్ వ్యవహారాలపై మాట్లాడుతానని ఓపెన్‌గా చెప్పారు. ఆయా అంశాలు ఓ కొలిక్కిరావడం ఖాయమని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

ALSO READ: అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ

ఇదేకాకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో సమావేశంకానున్నారు పవన్ కల్యాణ్. ఆయా శాఖలకు సంబంధించిన నిధులను బడ్జెట్‌లో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు ముందు పవన్ ఢిల్లీ వెళ్లడం మంచిదేనని అంటున్నారు జనసైనికులు.

Tags

Related News

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి రాంబాబు

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Minister Kandula Durgesh: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం

Tirumala Laddu: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?

Ysrcp Mlas: ఇంట్లో కుంపటి.. జగన్‌కు ఇక ఝలక్‌ల మీద ఝలక్‌లే, ఎందుకంటే?

Kadambari Jatwani: న్యాయం కోసం.. హోంమంత్రి అనితను కలిసిన.. నటి కాదంబరి జత్వానీ

Big Stories

×