EPAPER

Deputy CM Narayana Swamy Comments: డిప్యూటీ సీఎం మాట.. పోలీసులు పట్టించుకోవట్లేదట..

Deputy CM Narayana Swamy Comments: డిప్యూటీ సీఎం మాట.. పోలీసులు పట్టించుకోవట్లేదట..

Deputy CM Narayana Swamy Hot Comments on Police: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ‌స్వామి గురించి అందరికీ తెలుసు. మనసులోని ఏమీ ఉంచుకోరు. ఏది అనుకుంటే అది బయటకు చెప్పడం ఆయన నైజం. సొంతపార్టీ అయినా, విపక్ష టీడీపీ అయినా ఆయనేం పట్టించుకోరు.


ఎన్నికల పోలింగ్ తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు ఒకొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు తున్నారు. టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కు అయిపోయారని ఆరోపించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా అదే పంథాను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నారాయణ స్వామి తన ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు.

తన మాటలు పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు డిప్యూటీ సీఎం. ఎస్పీ, డీఎస్పీలు చంద్రబాబుకు తొత్తుగా మారారన్నది ఆయన ఆరోపణ. మరి ఐదేళ్లు అధికారంలో ఉన్నది ఆ పార్టీ. అప్పుడు పనిచేసిన పోలీసులే, ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఎన్నికల సంఘం కొందరు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. లోకల్‌లో ఉన్నది అప్పుడున్న పోలీసులే. మరి ఆయన ఆవేదన ఏంటోనని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు.


Also Read: Perni Nani Comments: పక్కా ప్లాన్ ప్రకారమే దారుణాలకు పాల్పడ్డారు: పేర్ని నాని

తమకు పోలీసుల రక్షణ అవసరం లేదని, తన శక్తి ఉన్నంతవరకు తమ జాతిని తామే కాపాడుకుంటామని చివరలో వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఇంతకీ ఆయనకు వచ్చిన కష్టం ఏంటో చెప్పలేదు. టీడీపీ ప్రభుత్వంలో ముద్రగడ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు నారాయణ స్వామి వంతైంది. అన్నట్లు ఈసారి ఎన్నికల్లో వైసీపీ పార్టీ నారాయణస్వామికి టికెట్ ఇవ్వలేదు. స్వామికి బదులుగా ఆయన కూతుర్ని రంగంలోకి దించింది.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×