Big Stories

Viveka Murder Case: అందుకే వివేకాను చంపాం.. దస్తగిరి స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు..

dastagiri viveka

Viveka Murder Case(Andhra Pradesh News): వివేకా హత్యకేసులో CBI విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే MP అవినాష్‌రెడ్డిని విచారించిన సీబీఐ.. అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డిని ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా నాలుగోరోజు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని CBI విచారణ జరిపింది. వివేకా హత్యకు సంబంధించి దాదాపు ఆరుగంటల పాటు సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు రంజాన్ సందర్భంగా సెలవు కావడంతో అవినాష్‌రెడ్డిని విచారించలేదు. ఈ కేసులో అవినాష్‌రెడ్డిని CBI సోమవారం ప్రశ్నించనుంది. మరోవైపు ఈ కేసులో నిందితుడు దస్తగిరి వాంగ్మూలం సంచలనం రేపుతోంది. వివేకా హత్యకు సంబంధించి కీలక విషయాలను తన వాంగ్మూలంలో తెలిపాడు.

- Advertisement -

మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్యకు సంబంధించి CBIకి దస్తగిరి ఇచ్చిన తొలి స్టేట్‌మెంట్ బయటకు వచ్చింది. ఇందులో దస్తగిరి పేర్కొన్న విషయాలకు, ప్రస్తుతం కస్టడీలో ఇచ్చిన స్టేట్‌మెంట్‌లోని వివరాలకు చాలా తేడాలు ఉన్నాయని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. అంతకుముందు.. దస్తగిరి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెల్లడించాడు. వివేకాతో తనకు 2016 నుంచే పరిచయం ఉందని పేర్కొన్నాడు.

- Advertisement -

డ్రైవర్‌గా పని చేస్తున్న సమయంలో తన దృష్టికి వచ్చిన పలు అంశాల్ని కూడా దస్తగిరి… సీబీఐకి వెల్లడించాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణమైన వారితో పాటు తనను కూడా వివేకా దారుణంగా తిట్టారని దస్తగిరి చెప్పాడు. అనంతరం కడపకు చెందిన రాధాకృష్ణమూర్తి, అతని కుమారుడు ప్రసాదమూర్తి మధ్య భూవివాదానికి సంబంధించిన సెటిట్‌మెంట్ గురించి 2017 నుంచి 2018 వరకు బెంగళూరులో తిరిగామని చెప్పాడు. ఆ సెటిల్‌మెంట్ తర్వాత వివేకాకు 8 కోట్ల రూపాయలు వస్తాయనే విషయం తమకు తెలుసని అన్నాడు. అలాగే 2018లో వివేకా, ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి బెంగళూరు వెళ్లారని దస్తగిరి తన స్టేట్‌మెంట్‌లో తెలిపాడు.

ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో వచ్చిన 8 కోట్లలో 50శాతం వాటా ఇవ్వాలని ఎర్ర గంగిరెడ్డి అడగడంతో వివేకా మండిపడ్డారని సీబీఐకి దస్తగిరి చెప్పాడు. నన్నే వాటా అడిగేంత పెద్దోడివి అయ్యావా? అంటూ గంగిరెడ్డిని వివేకా ప్రశ్నించారని అన్నాడు. ఆ రోజు నుంచి వివేకా, గంగిరెడ్డి మధ్య మాటల్లేవని చెప్పాడు. ఈ క్రమంలోనే 2019 ఫిబ్రవరిలో ఎర్ర గంగిరెడ్డి పిలవడంతో తాను పులివెందులకు వెళ్లి ఆయనను కలిసినట్టు దస్తగిరి చెప్పాడు. వివేకాను చంపాలని చెప్పగా తాను ముందు ఒప్పుకోలేదని వివరించాడు. అయితే… లైఫ్ సెటిల్‌ అయ్యేంత పెద్ద మొత్తం అమౌంట్‌ ఇస్తామని, ఈ పథకం వెనక చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు దస్తగిరి సీబీఐకి తెలిపాడు. దీంతో వివేకాను హత్య చేసేందుకు ఒప్పుకున్నట్టు దస్తగిరి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News