EPAPER

Dadi Veerabhadra Rao : టీడీపీలో చేరనున్న దాడి.. అసంతృప్తి వల్లే వైసీపీకి రాజీనామా..

Dadi Veerabhadra Rao : విశాఖపట్నంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత , మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా లేఖను సీఎం జగన్‌తో పాటు ఇతర కీలక నేతలకు పంపినట్టు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు.

Dadi Veerabhadra Rao : టీడీపీలో చేరనున్న దాడి..  అసంతృప్తి వల్లే వైసీపీకి రాజీనామా..

Dadi Veerabhadra Rao : విశాఖపట్నంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత , మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా లేఖను సీఎం జగన్‌తో పాటు ఇతర కీలక నేతలకు పంపినట్టు దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ తెలిపారు.


బుధవారం చంద్రబాబుతో భేటీ కానున్నట్టు దాడి రత్నాకర్ ప్రకటించారు. అనుచరులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఆయన చెప్పారు. తాము మళ్లీ సొంత గూటికి వెళుతున్నట్టుగా ఉందనిరత్నాకర్ తెలిపారు. గతంలో దాడి వీరభద్రరావును జనసేనలోకి పవన్ ఆహ్వానించారు. దీంతో ఆయనతోపాటు కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా టీడీపీ వైపు ఆయన అడుగులు వేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గతంలో తెలుగు దేశంలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదన్న టాక్ ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్ కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓడిపోయారు.


Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×