EPAPER

Cyclone Michaung Update: ముంచుకొస్తున్న మిచౌంగ్.. ఏపీలో ఈ జిల్లాలకు కుంభవృష్టి

Cyclone Michaung Update: ముంచుకొస్తున్న మిచౌంగ్.. ఏపీలో ఈ జిల్లాలకు కుంభవృష్టి
AP weather report today telugu

Cyclone Michaung Update(AP weather report today telugu):

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం మధ్యాహ్నానికి వాయుగుండంగా మారగా.. గత ఆరు గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబరు 1వ తేదీ రాత్రి 11 గంటల నాటికి, పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా దాదాపు 630 కి.మీ దూరంలో అక్షాంశం 10.3°N, రేఖాంశం 85.3°E వద్ద అల్పపీడన కేంద్రం గుర్తించినట్లు ఐఎండీ తెలిపింది.


ఐఎండీ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ప్రస్తుతం వాయుగుండంగా ఉన్న దాని స్థానం చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 630 కి.మీ, నెల్లూరుకు ఆగ్నేయంగా 740 కి.మీ, బాపట్లకు ఆగ్నేయంగా 810 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 800 కి.మీల దూరంలో ఉంది. రాబోయే 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని, డిసెంబర్ 3 నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుపాను ‘మిచౌంగ్’గా పరిణామం చెందుతుందని భావిస్తున్నారు.

ఈ తుపాను వాయువ్యంగా మారి, డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నానికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు తీరాలకు చేరుకుంటుందని అంచనాలు సూచిస్తున్నాయి. నెల్లూరు – మచిలీపట్నం మధ్య డిసెంబరు 5వ తేదీ లోగా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను తీరందాటే సమయంలో.. గరిష్టంగా గంటకు 80-90 కి.మీ వేగంతో గాలులు, కొన్నిప్రాంతాల్లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.


తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ 12 జిల్లాల పాలకవర్గాలతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న 2-3 రోజుల్లో తమిళనాడులోని వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. స్టాలిన్ తగిన మార్గదర్శకాలను జారీ చేశారు. రాబోయే తుపానుకు హాని కలిగించే ప్రాంతాల నుండి నివాసితులను ఖాళీ చేయడంతో సహా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులందరినీ ఆదేశించారు.

వాయుగుండం ప్రభావంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు.. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. 3న దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు.. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలు, కాకినాడ, కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి.

డిసెంబర్ 4న కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, 5న కోస్తా, రాయలసీమల్లోని చాలా ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. శనివారం నుంచి కోస్తాలో ఈదురుగాలులు పెరుగుతాయని వెల్లడించింది. వాయుగుండం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, డిసెంబర్ 6వ తేదీ వరకూ మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. మరోవైపు తమిళనాడులోని చెన్నై, తిరువల్లూరు, కాంచీపురంలలో రెడ్ అలర్ట్, మరో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రెండురోజులుగా తమిళనాడులో వర్షాలు కురుస్తుండటంతో పలు కాలనీలు నీటమునిగాయి.

Tags

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×