EPAPER

Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసుకోండి

Tirumala News: తిరుమల వెళ్తున్నారా.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందో తెలుసుకోండి

Tirumala News: శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. గోవిందా హరి గోవిందా.. వేంకటరమణ గోవిందా.. అనే భక్తి కీర్తనం కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ శ్రీనివాసుడి సన్నిధిలో వింటే చాలు భక్తి పారవశ్యంలో పరవశించి పోవాల్సిందే. గోవిందా నామస్మరణ భక్తిశ్రద్దలతో పఠిస్తే చాలు.. ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుంది. అటువంటి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారిని దర్శించిన భక్తులు లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావించి.. నిశ్చలమైన భక్తితో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. శ్రీవారి సేవలో భక్తులు తరిస్తే.. భక్తుల సేవలో టీటీడీ నిరంతరం తరిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనార్థం ఎన్ని గంటల సమయం పడుతుంది? తాజాగా ఎందరు భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం.


తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వస్తుంటారు. అంతేకాదు విదేశాల నుండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు రావడం పరిపాటి. అందుకే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ నిరంతరం కృషి చేస్తోంది. స్వామివారి దర్శనంకై ఎందరో భక్తులు సుదూర ప్రాంతాల నుండి పాదయాత్ర ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అంతేకాదు అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం నుండి కాలినడకన నిర్మలకు చేరుకుంటారు భక్తులు. కాలినడకన వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది టీటీడీ. సెలవు దినాలలో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తారు భక్తులు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఉద్దేశంతో.. ప్రత్యేకమైన రోజుల్లో శ్రీవారి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తుంది టీటీడీ.

స్వామి వారిని దర్శించుకున్న భక్తులు.. తమ కోరికలు తీరిన వెంటనే మొక్కులు తీర్చుకుంటారు. పలువురు కానుకలు సమర్పిస్తే, మరికొందరు తలనీలాలు సమర్పించే తమ భక్తిని చాటుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల నోట వినిపించే మాట.. గోవిందా నామస్మరణమే. అందుకే తిరువీధులు నిరంతరం గోవింద నామస్మరణతో మారూమ్రోగుతాయి.


Also Read: Vastu Shastra for Idols: ఇంట్లో ఈ 5 విగ్రహాలు ఉంచితే ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది !

ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 6 నుండి 8 గంటల గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే శనివారం స్వామి వారిని 80,741 మంది భక్తులు దర్శించుకోగా.. 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.45 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

ఇక,
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళీ టిన్‌లు సీల్డ్ టెండ‌ర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళీ టిన్‌లు 2025 మార్చి 31వ తేదీ వ‌ర‌కు సేక‌రించ‌వ‌చ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ వేలం కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు అక్టోబరు 23వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేసే అవకాశం కల్పించినట్లు టీటీడీ ప్రకటించింది.

Related News

Rain Alert: అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుఫాన్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు !

IAS PRASHANTHI : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్… తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన అధికారిణి

Tirumala Tickets Issue: ఏ పాపం తెలియదు.. కుట్ర జరుగుతోందంటున్న జకియా ఖానమ్.. సంబంధం లేదంటున్న బొత్స

CM Chandrababu: కుప్పంలో అధికారుల నిర్వాకం.. సీఎం చంద్రబాబుకు దక్కని చోటు.. సోషల్ మీడియాలో వైరల్

Divvala Maduri: దివ్వెల మాధురి ఇంటికెళ్లిన పోలీసులు.. స్వయంగా నోటీసులు జారీ.. ఏ కేసులో తెలుసా!

MLC Zakia Khanam: ఎమ్మెల్సీ సిఫార్సు లేఖపై శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల విక్రయం.. భక్తుడి ఫిర్యాదు.. ఎమ్మెల్సీపై కేసు నమోదు

TTD Wedding Gifts: వివాహం నిశ్చయమైందా.. అయితే ఈ గొప్ప అవకాశం మిస్ కావద్దు.. శ్రీవారి కానుక ఉచితంగా మీ చెంతకు..

Big Stories

×