Big Stories

ycp : పార్టీ పేరు చంద్రసేనగా మార్చుకో.. పవన్ కు మంత్రులు సూచన..

ycp : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై మాటల దాడిని పెంచారు ఏపీ మంత్రులు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ప్రభుత్వంపై పవన్ చేసిన విమర్శలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు కౌంటర్ ఇచ్చారు. పాలనా వికేంద్రీకరణే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్ కు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేయాలో పవన్ సూచించాలన్నారు.

- Advertisement -

పవన్‌ స్పీచ్‌ ఆంబోతు రంకెలేసినట్టు ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. పవన్‌ పార్టీకి ఓ విధానం గానీ ఎజెండా గానీ లేవని విమర్శించారు. పవన్‌ ను రాజకీయ వ్యభిచారిగా పేర్కొన్నారు. కాపుల మీద పవన్‌కు పేటెంట్‌ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్‌లా డబ్బులకు అమ్ముడుపోయే రాజకీయం చేసే కుటుంబం తనది కాదన్నారు. జనసేన పేరు మార్చి చంద్రసేనగా పెట్టుకుంటే బెటర్‌ అని అమర్ నాథ్ సూచించారు. పవన్‌లో ప్రవహిస్తోంది కమ్మని పసుపు రక్తమని, పవన్ కి ఉన్నవి నారా వారి నరాలు అని ఘాటుగా విమర్శించారు.

- Advertisement -

చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే పవన్ నడుస్తున్నారని మరో మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. నాయకుడు అంటే కార్యకర్తల్లో స్ఫూర్తిని నింపాలే కానీ, ప్యాకేజీ మాటలు మాట్లాడకూదన్నారు. పవన్‌ కల్యాణ్‌ సభలకు పేర్లు కూడా టీడీపీనే నిర్ణయిస్తుందన్నారు.చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదన్నారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. చంద్రబాబు ప్యాకేజీ కోసం వాళ్లు ఏది చెబితే పవన్‌ అది చేస్తున్నారని విమర్శించారు. కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబుకు పవన్‌ తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. రాజకీయం అంటే ఎంతసేపు ఊడిగం చేయడమేనా? రాష్ట్రాభివృద్ధిపై చర్చకు పవన్‌ సిద్ధమా? వస్తే రాష్ట్రంపై ఏ స్థాయిలో అవగాహన ఉందో తేలుతుందన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News