EPAPER

Prakasam Crime news: హమ్మా.. చోరీ చేసి ఎంచక్కా కొండెక్కాడు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాల్సిందే!

Prakasam Crime news: హమ్మా.. చోరీ చేసి ఎంచక్కా కొండెక్కాడు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాల్సిందే!

Prakasam Crime news: ఈ వ్యక్తి.. చోరీకి పాల్పడ్డాడు.. కొండెక్కి కూర్చున్నాడు సైలెంట్ గా.. నా పని అయిపోయింది.. ఇక ఎంజాయ్ అనుకున్నాడు.. కానీ అసలు కథ అక్కడే జరిగింది. ఇంతకు ఏమి జరిగింది ? ఆ దొంగ ఏమి చేశాడో ? పూర్తి విషయాలు తెలుసుకోవాల్సిందే.


పోలీసుల వివరాల మేరకు..
కనిగిరిలోని దొరువు బజార్‌ వద్ద గల కొండకు సమీపంలో అయ్యప్ప ఆలయం వెలసి ఉంది. ఇక్కడికి భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అయితే పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు.. ఆలయ రక్షణకు అక్కడి కమిటీ సభ్యులు.. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. రోజువారీ మాదిరిగానే ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి.. మధ్యాహ్నం తాళాలు వేసి వెళ్లిపోయారు. ఇక సాయంత్రమైంది. పూజలు నిర్వహించే పూజారి రాలేదు కానీ.. చోరీ చేద్దామనుకున్న వ్యక్తి ఎంటరయ్యాడు ఆలయంలోకి..

ఇంకేముంది.. ఇటీవల దొంగలు కూడా తెలివి మీరారు కదా.. అందుకే ముందుగా దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తి.. ఏకంగా సీసీ కెమెరాలను పగలగొట్టేశాడు. ఇక చోరీ పనిలోకి దిగి.. మూడు కలశంలను చోరీ చేసి పారిపోయాడు. చోరీ జరిగిన సమయం సాయంత్రం కావడంతో స్థానికులు అలర్ట్ అయ్యారు. అయితే చోరీ పాల్పడిన వ్యక్తి వద్ద ఏ ఆయుధం ఉందోనన్న భయం వారిది. అందుకే తెలివిగా కనిగిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలో పామూరు బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ (HG – 764) సీతారాం ప్రసాద్ కు సమాచారం ఇచ్చారు.


ట్రాఫిక్ విధుల్లో ఉన్న సీతారాం వెంటనే.. ఇప్పుడే చోరీ జరిగింది కాబట్టి.. దొంగను ఇట్టే పట్టేయవచ్చని భావించారు. వెంటనే స్టేషన్ ఎస్సైకి సమాచారం ఇచ్చారు. అప్పటికే చోరీ చేసిన వ్యక్తి.. ఎంచక్కా కొండపైకి ఎక్కాడు. ఆ విషయం తెలుసుకున్న హోమ్ గార్డ్ సీతారాం ప్రసాద్ ఒక్కరే కొండపైకి వెళ్లారు. అక్కడ చోరీ చేసిన వ్యక్తిని గమనించి.. ధైర్యంగా పట్టుకున్నారు. అతడి చేతులను గట్టిగా పట్టుకొని కొండ క్రిందికి తీసుకువచ్చి.. కనిగిరి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

Also Read: AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. ఆ జిల్లాలో ఏకంగా.. ?

పోలీసులకు చిక్కడు.. దొరకడనుకున్న చోరుడు.. పోలీసులకు చిక్కడంతో స్థానిక ప్రజలు సైతం హోమ్ గార్డ్ సీతారాం ప్రసాద్ ను అభినందించారు. అయితే చోరుడి వద్ద ఏవైనా ఆయుధాలు ఉన్నాయా లేవా.. అనే ఆలోచన లేకుండా.. ధైర్యంగా ముందడుగు వేసి, ఒక్కరే వెళ్లి చాకచక్యంగా పట్టుకున్న హోమ్ గార్డ్ కి అభినందనలు వెల్లువెత్తాయి. కనిగిరి పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు అభినందనలు తెలుపగా.. జరిగిన విషయం తెలుసుకున్న ప్రకాశం ఎస్పీ దామోదర్.. జిల్లా ఎస్పీ కార్యాలయానికి హోమ్ గార్డ్ సీతారాం ప్రసాద్ ను పిలిపించారు.

అసలు ఆరోజు ఏమి జరిగిందో తెలుసుకున్న ఎస్పీ.. అతని ధైర్యసాహసాన్ని మెచ్చుకొని క్యాష్ రివార్డ్, ప్రశంసా పత్రంను అందజేశారు. సూపర్ కాప్ అంటూ జిల్లా పోలీస్ అధికారులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే చోరీ చేసి కొండెక్కిన ముద్దాయి మాత్రం కటకటాల పాలయ్యాడు. ఇంతకు చోరీకి పాల్పడింది ఎవరంటే.. కనిగిరికి చెందిన 28 సంవత్సరాల పోల అంకయ్య.

Related News

AP Liquor Policy: అదృష్టం అనుకొనే లోపే అదృశ్యం.. మద్యం షాప్ దక్కించుకున్న వ్యక్తి జాడ ఎక్కడ ? పోలీసులకు భార్య ఫిర్యాదు

Tirumala: భారీ వర్షాలకు తిరుమల వెళ్తున్నారా.. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి.. ఆ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దక్కాయంటే.. ?

Pawan Kalyan: పవన్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్.. రేపే విచారణ.. అంతా సస్పెన్స్

IAS PETITIONS IN CAT : క్యాట్​కు వెళ్లిన ఐఏఎస్​లు… ఏపీలోనే ఉంటానంటున్న సృజన, తెలంగాణ కావాలంటున్న ఆమ్రపాలి

CM Chandrababu: ఏపీలో మళ్లీ వర్షాలు…! జనాల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు…

Big Stories

×