EPAPER

Andhra Pradesh : నెక్ట్స్ టార్గెట్ ఏపీ.. 10 గ్యారంటీలతో ప్రజల్లోకి కాంగ్రెస్..

Andhra Pradesh : నెక్ట్స్ టార్గెట్ ఏపీ.. 10 గ్యారంటీలతో ప్రజల్లోకి కాంగ్రెస్..

Andhra Pradesh : ఏపీలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక, తెలంగాణల్లో విక్టరీతో ఫుల్ జోష్‌లో ఉన్న హస్తం పార్టీ.. ఆ దిశగా ప్రణాళికలకు సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో ఏఐసీసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నాళ్లనుంచో రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేక హోదానే ప్రధాన ఎజెండాగా ఎన్నికలకు వెళ్లనుంది కాంగ్రెస్‌.


ఈ ఎన్నికల హామీలపైనా కాంగ్రెస్ దృష్టిపెట్టింది. ఏపీకి 10 గ్యారంటీలు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారంపైనా ఫోకస్ పెట్టింది. 3 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సభల్లో రాహుల్‌ గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు రావాలని ఏపీ నేతలు కోరినట్టు తెలుస్తోంది. ఇలా ప్రచారం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది.

సీఎం జగన్‌ను టార్గెట్‌ గా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. అధికార వైసీపీ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. జగన్ సర్కార్ ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అంటున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.


ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తోంది. బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం చేపట్టిన 10 గ్యారంటీలను ప్రకటించి ప్రజలను ఆకట్టుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను సాధించాలని యోచిస్తోంది.

.

.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×