EPAPER

Sharmila : షర్మిల పర్యటనతో కాంగ్రెస్ లో జోష్.. బాధ్యతలు తీసుకుంటున్న నేతలు..

Sharmila : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల యాత్రకు మంచి స్పందనే లభిస్తుండటం. కాంగ్రెస్ వర్గాల్లో జోష్ నింపుతోంది. గతంలో కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా పని చేసిన వారిని కలుపుకుని వెళ్తున్న షర్మిల.

Sharmila : షర్మిల పర్యటనతో కాంగ్రెస్ లో జోష్.. బాధ్యతలు తీసుకుంటున్న నేతలు..

Sharmila : ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పీసీసీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల యాత్రకు మంచి స్పందనే లభిస్తుండటం. కాంగ్రెస్ వర్గాల్లో జోష్ నింపుతోంది. గతంలో కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా పని చేసిన వారిని కలుపుకుని వెళ్తున్న షర్మిల.. జిల్లాల్లో స్థబ్ధతుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్ని తట్టి లేపడంలో సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తున్నారు. ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన జిల్లా నుంచి గల్లీ స్థాయి నేతలు.. షర్మిల యాత్రలో ఉత్సాహంగా పాల్గొంటుండటం విశేషం. జగన్ సర్కారుని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్న షర్మిల.. ఈ యాత్ర తర్వాత ఏం చేయబోతున్నారు?. మున్మందు ఆమె యాక్షన్ ప్లాన్ ఏంటి?


రాష్ట్ర విభజనతో కకావికలమైన కాంగ్రెస్‌ శ్రేణుల్లో పీసీసీ అధ్యక్షులు షర్మిల జిల్లా పర్యటనలతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కనుచూపుమేరలో కోలుకోలేదని అంతా భావించిన కాంగ్రెస్‌లోకి.. వైఎస్ కుమార్తె ఎంట్రీ ఇచ్చి.. వచ్చి రాగానే తన అన్న జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం విరుచుకుపడుతున్న తీరుతో ఆ పార్టీ వారిలో ధీమా పెరుగుతోంది.

ఇచ్ఛాపురం నుంచి మొదలైన షర్మిల పర్యటన ఇప్పటికే వివిధ జాల్లాల్లో పూర్తైంది. మొన్నటివరకు ఉన్నామా? లేమా? అన్నట్లు ఉన్న నాయకులు షర్మిల పర్యటనలతో యాక్టివ్ అవుతున్నారు. జిల్లా పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకుని.. నాయకులు, కార్యకర్తల తరలింపులో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. టూర్‌లో షర్మిల ప్రదర్శిస్తున్న దూకుడు , ప్రసంగిస్తున్న తీరుతో కాంగ్రెస్ వాదులు.. తమకు మంచి రోజులొచ్చాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఈ జిల్లాల పర్యటనలు ముగిసాక.. విజయవాడ కేంద్రంగా షర్మిల రానున్న ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తుకి ఆమె విజయవాడ నగరంలో మకాం వేయనున్నారు. విజయవాడలో ఆమె బస చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇండిపెండెంట్ హౌస్ రెడీ చేస్తున్నారు.

విజయవాడలోని ఇంట్లోనే ఉంటూ అక్కడి నుంచే పనిచేయనున్నారు షర్మిల.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఆమె నిత్యం పార్టీ నేతలతో పలు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. పార్టీలోకి చేరికలకు, అభ్యర్ధుల ఎంపికకు పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఏఐసీసీ నేతలు విజయవాడ వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. దాంతో ఆమె వారికి అందుబాటులో ఉండాలి.

అందుకే షర్మిల దీంతో అతి త్వరలోనే విజయవాడకు మకాం మార్చనున్నారు. పార్టీ వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలోకి రప్పించటం. పార్టీ ఓటు బ్యాంకును మళ్లీ పార్టీ వైపు మళ్లేలా చేయడం వంటి గురుతర బాధ్యతలు ఆమెపై ఉన్నాయి. ఆ లెక్కలతోనే కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ కుమార్తెకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. అందులో భాగంగా సీట్లు దక్కని ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. షర్మిల సైతం జగన్‌ని టార్గెట్ చేస్తూ. పార్టీ ఓటు బ్యాంకుని తిరిగి ఆకట్టుకునే పనిలో పడ్డారు.

ఆ క్రమంలో ఒకవైపు అభ్యర్థులకు సంబంధించిన అంశాలు ఫైనల్ చేసుకుంటూనే.. షర్మిల మరోసారి నియోజకవర్గాల్లో పర్యటనలకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. 175 నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించి.. ఆ క్లస్టర్లలో ఆమె పర్యటనలకు షెడ్యూల్ ప్రిపేర్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు.. కేండెట్ల ఎంపికతో పాటు.. నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న నేతలను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని రావటానికి ఆ పర్యటన ఉపయోగపడుతుందని కాంగ్రెస్ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. మొత్తానికి ఏపీ కాంగ్రెస్‌ను ట్రాక్‌ ఎక్కించడంలో సక్సెస్ అవుతున్నట్లే కనిపిస్తున్నారామె.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×