EPAPER

YS Sharmila Chalo Secretariat: చలో సెక్రటేరియట్‌.. షర్మిల అరెస్ట్

YS Sharmila Chalo Secretariat: చలో సెక్రటేరియట్‌.. షర్మిల అరెస్ట్
YS Sharmila latest news

AP Congress Chalo Secretariat- YS Sharmila Arrest: ఇది ఆంధ్రప్రదేశ్ ఆ ? ఆప్ఘనిస్థానా ? అని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. డీఎస్సీ నోటిఫికేషన్ కు నిరసనగా గురువారం చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వగా.. రాష్ట్రంలో కొందరు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి.. మరికొందరిని అరెస్టులు చేసి పీఎస్ లకు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అని మండిపడ్డారు. సీఎం జగన్ ఒక దగా ముఖ్యమంత్రి అంటూ విమర్శలు గుప్పించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన 23 రోజుల్లోనే పరీక్షలంటే.. అభ్యర్థులకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎన్ని ఖాళీలను భర్తీ చేసిందో చెప్పాలని, ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన ఐదేళ్లైనా.. ఇప్పటి వరకూ మెగా డీఎస్సీ ఊసే లేదన్నారు. నిరుద్యోగులపై దేవుడి దయ ఉంది కానీ.. మీ దయే లేదని.. అందుకే దగా డీఎస్సీ ఇచ్చారని మండిపడ్డారు.

Read More: అమెరికా నుంచి వస్తుండగా గుండెపోటు.. టిడిపి నేత మృతి


ఏపీలో కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ నేతలను ఎక్కడిక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు పోలీసులు. నిరుద్యోగ సమస్యలపై నిరసనలకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు.. కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన చలో సెక్రటేరియట్‌కు అనుమతి లేదని..ఆ పార్టీ నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచే హౌస్‌ అరెస్ట్‌లు ప్రారంభించిన పోలీసులు.. తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్‌ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఏపీలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Political news in AP

నిరుద్యోగ సమస్యలపై ఛలో సెక్రటేరియట్ పేరిట సచివాలయ మార్చ్‌కు పిలుపునిచ్చింది ఏపీ కాంగ్రెస్‌. మెగా డీఎస్సీ ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని..నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఇందులో భాగంగానే నిన్న సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న షర్మిల.. సడెన్‌గా రూట్ మార్చి కేవీపీ ఇంటికి కాకుండా.. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్‌కు వెళ్లారు. అయితే మొదట అంపాపురంలోని కేవీపీ నివాసానికి వెళ్లాలని భావించిన షర్మిల.. పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకుని రూట్ మార్చి.. పార్టీ నేతలతో ఆంధ్ర రత్న భవన్‌కు వెళ్లారు.

గురువారం ఉదయం అక్కడి నుంచే ఛలో సెక్రటేరియట్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్‌ ఇచ్చిన ఛలో సెక్రటేరియట్‌ పిలుపుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నేతలను ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేస్తుండటంతో.. ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రాత్రి అక్కడే బస చేశారు షర్మిల.

షర్మిల.. ఆంధ్రరత్న భవన్‌కు చేరుకోవడంతో.. పార్టీ కార్యాలయాన్ని వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చలో సెక్రటేరియట్‌కు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కానీ..తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. ఎట్టి పరిస్థితుల్లో చలో సెక్రటేరియట్‌ వెళ్లి తీరుతామంటున్నారు వైఎస్‌ షర్మిల. ఏపీ ప్రభుత్వం ఇటీవల 6,100 టీచర్ పోస్టులో డీఎస్సీ ప్రకటించింది. అయితే, ఇచ్చిన హామీ మేరకు పాతిక వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.

ఉండవల్లి కరకట్ట సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. కొండవీటి ఎత్తిపోతల పథకం వద్ద షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×