EPAPER

CM Jagan: చంద్రబాబు.. దత్తపుత్రడు నాన్ లోకల్స్.. పవన్ కంటే బర్రెలక్కే బెటర్..

CM Jagan: చంద్రబాబు.. దత్తపుత్రడు నాన్ లోకల్స్.. పవన్ కంటే బర్రెలక్కే బెటర్..
YCP Jagan latest news

YCP Jagan latest news(Political news in AP):

తెలంగాణాలో ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని డైలాగులు కొట్టిన పవన్ కళ్యాన్ కి.. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం రూ. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చారు. అనంతరం మకరాపురం నుంచి పలాస బయలు దేరారు. పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించి.. రైల్వే గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు.


“పేదల బతుకులు మార్చాలనే తపన మీ బిడ్డ అయిన నాకు మాత్రమే ఉంది” అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉద్దానం అంటే ఉద్యానవనం అని, ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశానన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రూ. 85కోట్లతో నిర్మాణం చేపట్టామన్నారు. రాష్ట్రంలో కిడ్నీ రోగుల కోసం రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. కిగ్నీ వ్యాధి గ్రస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారికి వైద్యం అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇక నుంచి చికిత్స కోసం ఎక్కడికో పోవాల్సిన పని లేదన్నారు. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధికి శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. రాష్టంలోనే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. 42 మంది వైద్యులను , పారా మెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే మా ద్యేయమన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో కిడ్నీ వ్యాధి సమస్య ఉందని, వారికి సైతం పరిష్కారం చూపిస్తామన్నారు. విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉంటామన్నారు. నాన్ డయాలసిస్ రోగులకు కూడా రూ. 5వేలు ఇస్తున్నామన్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పెన్షన్ రూ.10వేలు పెంచమన్నారు. దేవుని దయతో కిగ్ని రీసెర్చ్ సెంటర్, 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకున్నామన్నారు.

పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు ఏ మాత్రం లెక్కలేదన్నారు. కనీసం సొంత నియోజకవర్గం కుప్పంకి కూడా నీరు అందించలేదని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలు వచ్చే సరికి పొత్తులు , జిత్తులు, ఎత్తులు పెట్టుకోవడానికి పోటీ పడతారని, పూర్థిగా చిత్తులపై ఆదారపడి ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. పక్కన ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టుకొన్నారన్నారు. అభివృద్దిని ఓర్వలేని వ్యక్తులు రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఒక్క మంచి పథకం అయినా తెచ్చారా ? అని ప్రశ్నించారు.


ఉత్తరాంధ్రకు చంద్రబాబు, దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదన్నారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారు. విశాఖకు సీఎం వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారు. నాన్ లోకల్స్ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాలో నిర్ణయిస్తామంటారని హెద్దేవా చేశారు. ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు పేద వాడికి 5 సెంట్ల భూమిని ఇవ్వలేదన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే మీ బిడ్డ 82 లక్షల ఇండ్లను పేదలకు కట్టిస్తూ ఉంటూ ఏడుస్తున్నారని విమర్శిస్తున్నారు. పేదల కోసం జగన్న గోరుముద్ద, పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడితే ఏడుస్తున్నారన్నారు. 8వ తరగతి పిల్లలకు ల్యాప్ టాప్ లు ఇస్తే ఓర్వలేక ఏడుస్తున్నారన్నారు. తినడం, దోచుకోవడం పంచుకోవడం తప్పా, అభివృద్ది తెలియని చంద్రబాబు ఓర్వలేక ఏడుపే.. ఏడుపు.. ఏడుస్తున్నారన్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×