EPAPER

CM Jagan Mohan Reddy : కేసీఆర్ తో ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడారు? విజయమ్మతో భేటీ అందుకేనా?

CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్‌ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పరామర్శించారు జగన్‌.

CM Jagan Mohan Reddy : కేసీఆర్ తో ఆ 45 నిమిషాలు ఏం మాట్లాడారు? విజయమ్మతో భేటీ అందుకేనా?

CM Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్‌ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని పరామర్శించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 7వ తేదీన కేసీఆర్‌ ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దీంతో తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స తర్వాత.. నందినగర్‌లోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌ను పరామర్శించారు జగన్‌. ఏపీ నుంచి బేగంపేటకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు స్వాగతం పలికారు.


అనంతరం నందినగర్‌కు చేరుకుని కేసీఆర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాలపాటు వీరి భేటీ సాగింది. అయితే.. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన రోజే కేసీఆర్‌ను జగన్‌ను కలవడం వెనుక పొలిటికల్‌ వ్యూహం ఏదో ఉందన్న టాక్‌ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేసీఆర్ తో ఏ అంశాలు చర్చించారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ భేటీ అనంతరం సీఎం జగన్‌ లోటస్‌పాండ్‌కు వెళ్లారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్‌ లోటస్‌పాండ్‌కు వెళ్లడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.చెల్లెలు షర్మిల కాంగ్రెస్‌లో చేరడం,.. పొలిటికల్‌ వార్‌కు సిద్ధమైన సమయంలో తల్లి విజయమ్మను జగన్‌ కలవడం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×