EPAPER

Jagan : స్వచ్ఛ సంకల్పం.. క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా .. ఈ-ఆటోలు ప్రారంభం..

Jagan : స్వచ్ఛ సంకల్పం.. క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా .. ఈ-ఆటోలు ప్రారంభం..


Jagan : రాష్ట్రాన్ని క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు ఈ–ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని వల్ల మున్సిపాల్టీలకు నిర్వహణ భారం కూడా తగ్గుతుంది.

తాడేపల్లి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ జెండా ఊపి 516 ఈ-ఆటోలను ప్రారంభించారు. 36 మున్సిపాల్టీలకు వీటిని పంపిణీ చేశారు. ఒక్కో ఆటో ఖరీదు రూ.4.10 లక్షలు. మొత్తం రూ.21.18 కోట్లతో ఈ-ఆటోలను కొనుగోలు చేశారు. ఆటో సామర్థ్యం 500 కిలోలు. ఈ– ఆటో డ్రైవర్లుగా మహిళలకే ఎక్కువ మంది అవకాశం కల్పించారు.


ఇప్పటికే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకోసం రూ.72 కోట్లతో 123 మున్సిపాలిటీల్లో చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. తడి, పొడి, హానికర వ్యర్ధాల సేకరణ కోసం 40 లక్షల కుటుంబాలకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో 3 చొప్పున చెత్తబుట్టలు ఇచ్చింది. గ్రేడ్‌–1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్‌ టిప్పర్లను ఉపయోగిస్తున్నారు. విశాఖ,గుంటూరులో వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టులు ప్రారంభించారు.

81 మున్సిపాలిటీలలో 135 గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు నిర్మిస్తున్నారు. తడి చెత్త నిర్వహణకు 29 వేస్ట్‌ టు కంపోస్ట్, 4 బయో మిథనేషన్‌ ప్రాజెక్ట్‌లు నడుస్తున్నాయి. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445 కోట్లతో 206 టీపీఐఎస్‌లు ఏర్పాటు చేస్తున్నారు. 55 మున్సిపాలిటీల్లో ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×