EPAPER

SHARMILA SON ENGAGEMENT : షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సీఎం జగన్..

SHARMILA SON ENGAGEMENT : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక.. హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు షర్మిల అన్న, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన సతీమణి వైఎస్‌ భారత్‌ హాజరయ్యారు. కాబోయే జంటను పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సమేతంగా ఫొటోలు దిగారు. వేడుకలో వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులు సందడి చేశారు.

నిశ్చితార్ధానికి హాజరైన వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి ఉన్నారు. అలానే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, మంచు మోహన్ బాబు ఫ్యామిలీ…. వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు.. సహా ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖులు ఫంక్షన్ లో పాల్గొన్నారు. కుమారుడి నిశ్చితార్ధానికి రాజకీయాలకు అతీతంగా పలు పార్టీ అధినేతలను షర్మిల ఆహ్వానించారు. నిశ్చితార్థ వేడుకలో 150 రకాల వంటకాలతో భోజనాలు పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ రుచులతో పాటు విదేశీ అతిధులకు ప్రత్యేక వంటకాలు చేయించారు.

రాజారెడ్డి ఇటీవలే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ ప్రిడిక్టివ్ అనలటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశారు. ఈ క్రమంలో అమెరికాలో చదువుకున్న ప్రియ అట్లూరితో.. గత నాలుగేళ్లుగా పరిచయం ప్రేమగా మారింది. కాగా పెద్దల అంగీకారంతో ఈ జంట పెళ్లి పీటలెక్కుతున్నారు. రాజారెడ్డి, అట్లూరి ప్రియ వివాహం ఫిబ్రవరి 17న రాజస్థాన్‌లో జరగనుంది. ఫిబ్రవరి 24న శంషాబాద్‌లో విందు ఉంటుంది.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×