EPAPER

Chandrababu on Jagan : చాలా దేశాలు తిరిగాను కానీ.. ఇలాంటి ప్యాలెస్ చూడలేదు – చంద్రబాబు

Chandrababu on Jagan : చాలా దేశాలు తిరిగాను కానీ.. ఇలాంటి ప్యాలెస్ చూడలేదు – చంద్రబాబు

Chandrababu on Jagan : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి.. వివాదాస్పద రుషికొండ ప్యాలెస్ ను సందర్శించారు. ఈ బిల్డంగ్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయ్యిందంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి సాధ్యమేనా ప్రశ్నించారు. ఓ వ్యక్తి తన విలాసాల కోసం ఇలాంటి  ప్యాలెస్ లు ప్రజాధనంతో కడతారా.? అని ఆశ్చర్యపడ్డారు. ఎవరో రాజుల కాలంలో, నియంతల పాలనలోనే ఇలాంటి నిర్మాణాలు చూసేవాళ్లమన్న సీఎం.. జగన్ ఆధునిక నియంత అనుకున్నారా.? అని ప్రశ్నించారు. జీవితాంతం తానే సీఎంగా ఉంటారనుకుని ఇలా ప్యాలెస్ లు కట్టుకుని ఉంటారని అన్నారు.


ఒక్క స్నానం చేసే టబ్బు కోసం రూ. 36 లక్షలు, కమోడ్ కోసం రూ. 12 లక్షలు ఖర్చు చేయడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రజల సొమ్ముతో ఇలాంటి కట్టడాలు కట్టాలంటే కరుడుగట్టిన నేరస్తుల వల్లే అవుతుందన్న చంద్రబాబు, అన్నింటికీ తెగిస్తేనే ఇలాంటివి చేయగలరని అన్నారు. బయటి ప్రపంచం అంతా విమర్శిస్తున్నా, మీడియా ఏం జరుగుతుందో చెప్పాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. జగన్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరినీ లోపలికి రానివ్వలేదని అన్నారు.

ఆకరికి తాను ప్రయత్నించినా, జనసేనా అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నించినా.. ఈ కట్టడం దగ్గరకు రాకుండా జగన్ అడ్డుకున్నారని అన్నారు. ప్రజాస్వామ్యం చాలా బలమైందన్న సీఎం చంద్రబాబు.. ఏ అధికారంతో అయితే జగన్ తమను అడ్డుకున్నారో.. అదే అధికారం ఇప్పుడు తమకు దక్కిందని, ఇప్పుడు ఈ బిల్డింగ్ ను ఏం చేయాలో నిర్ణయించే అధికారం తమదేనన్నారు. తాను చాలా దేశాలు తిరిగాన్న చంద్రబాబు.. ఇలాంటి ప్యాలెస్ ను ఎక్కడా చూడలేదని ఆశ్చర్యపడ్డారు.


ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారు.?

ఆర్థికంగా వెనుకబడ్డ ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. తన విలాసాల కోసం కట్టుకున్న ఈ ప్యాలెస్ కోసం మాత్రం ఏకంగా 450 కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గమని అన్నారు. అక్కడి విలాసాలకు డబ్బుల్ని మంచి నీళ్లలా ఖర్చు చేశారన్న చంద్రబాబు.. దేశీయంగా అన్ని వ్యవస్థలను తప్పుదోవ పట్టించి ఈ నిర్మాణం చేశారని అన్నారు.
జగన్ ఉత్తరాంధ్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించినా.. తమకు మాత్రం విశాఖలో పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయన్నారు. ఇప్పుడు వాళ్లంతా తాము ఎలాంటి పరిపాలన అందిస్తామోనని ఎదురుచూస్తున్నారని అన్నారు.

రుషికొండ ఫ్యాలెస్ పనికిరాదు

తాను జీవితంలో అనేక ప్రాంతాలు తిరిగామన్న చంద్రబాబు.. ఎన్నో రాజ భవనాల్ని చూశానని, కానీ ఇలాంటి బిల్డింగును మాత్రం చూడలేదని, ఈ నిర్మాణాలు చూస్తుంటే తనకు మైండ్ పోతుందని ఆశ్చర్యపడ్డారు. తాను కలలో కూడా ఇలాంటి నిర్మాణాలు చేసి ఉంటారని ఊహించలేదన్న చంద్రబాబు.. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ ప్యాలెస్ ను ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నారు.

Related News

DGP Warns Netizens: డిప్యూటీ సీఎం కామెంట్స్.. రంగంలోకి డీజీపీ.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్

Lady Aghori: విశాఖలో లేడీ అఘోరీ.. పవన్ కల్యాణ్‌కు నా ఆశీస్సులు

Chennai Crime: రైల్లో నుంచి వెళ్తూ.. సూట్‌కేసు విసిరేసిన జంట, దాన్ని ఓపెన్ చేస్తే.. దారుణం

Anilkumar, Jogi ramesh: కేసుల ఒత్తిడి.. ఇబ్బందుల్లో మాజీమంత్రులు, జనసేనతో మంతనాలు?

Ganesh Selfie Video: నా చావుకు కారణం వాళ్లే.. పవన్ కళ్యాణ్ న్యాయం చెయ్యాలి.. సెల్ఫీ వీడియో వైరల్

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. పెరిగిన హుండీ కానుకల ఆదాయం.. కారణం ఏంటంటే?

Roja Target Anitha: పవన్ కామెంట్స్.. శివాలెత్తిన ఫైర్‌బ్రాండ్ రోజా, వైసీపీ కార్యకర్తలకు కష్టాలు

Big Stories

×