EPAPER

CM Chandrababu: వణికిన బెజవాడ.. అర్థరాత్రి నుంచి ఉదయం వరకు.. ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu: వణికిన బెజవాడ.. అర్థరాత్రి నుంచి ఉదయం వరకు.. ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu: భారీ వర్షాలతో బెజవాడ గజగజలాడింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణాజిల్లాతోపాటు మిగతా జిల్లాలు వణికాయి. విజయవాడ నగరంపై బుడమేరు విరుచుకుపడింది. శనివారం అర్థరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం పోటెత్తింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది.


ప్రాంతాలకు ప్రాంతాలు నీట మునిగాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దాదాపు మూడు లక్షల మందికి ఆహారం లేక అల్లాడుతున్నారు. ఇళ్లలోని నీరు చొచ్చుకు రావడంతో దాదాపుగా ఇళ్ల నీట మునిగాయి. కలెక్టర్ కార్యాలయంలో మకాం వేసిన సీఎం చంద్రబాబు, వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారోనని భావించిన చివరకు సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగేశారు. అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వేర్వేరు ప్రాంతాల్లో బోట్లలో టార్చిలైట్లు వేసుకుని తిరుగుతూ స్థానికులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.


ALSO READ: అప్పటివరకు ఈ కలెక్టరేట్‌లోనే ఉంటా.. ఏం తమాషా చెస్తున్నారా? : సీఎం చంద్రబాబు

ఫెర్రీ, ఇబ్రహీంపట్నం, జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పారు. బుడమేరు దాటికి చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

ప్ర‌ధానంగా బుడ‌మేరు వ‌ర‌ద‌తో అస్త‌వ్య‌స్త‌మైన సింగ్‌న‌గ‌ర్ ప్రాంతంలో సీఎం చంద్ర‌బాబు ఆదివారం అర్ధ‌రాత్రి రెండుసార్లు పర్యటించారు. అర్ధరాత్రి 1.10 గంట‌ల‌కు కృష్ణ‌లంక‌లోని 16వ డివిజ‌న్ పోలీసు కాల‌నీలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా రక్ష‌ణ గోడ వ‌ద్ద వ‌ర‌ద నీటిని ప‌రిశీలించారు.

ఆదివారమంతా కలెక్టర్ కార్యాలయం నుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రి, ఆహారం తయారు చేయించడానికి ఎక్కడ అనువుగా ఉందో తెలుసుకున్నారు. అన్నిచోట్ల నుంచి వరద బాధితులకు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి ఆహారాన్ని హెలికాప్టర్ ద్వారా అందజేశారు.

బుడమేరు సమీపంలో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు. అర్ధరాత్రి ఒంటిగంటకు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. అందుకుముందు బాధితులకు స్వయంగా భోజనం అందజేశారు ముఖ్యమంత్రి. చాలామంది పేషెంట్లు, పిల్లలు ఉన్నారని, వారిని బయటకు తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమయ్యాారాయన.

 

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×