EPAPER

AP Free Gas Cylinders: ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

AP Free Gas Cylinders: ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళంలో ఈ ఉచిత సిలిండర్ల దీపం పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలోని గుడిపాలలో రవాణా శాఖ మంత్రి రామ్‌ ప్రసాద్‌ రెడ్డితో ఉచిత సిలిండర్ల పంపిణీ చేసి పథకాన్ని ప్రారంభిస్తారు.

లబ్ధిదారులు ఇప్పటి మాదిరిగానే గ్యాస్‌ సిలిండర్లు నగదును చెల్లించి గ్యాస్ సిలిండర్‌ పొందనున్నారు. సిలిండర్‌ ఇంటికి డెలివరీ అయిన 48 గంటల్లో ప్రత్యక్ష నగదు బదిలీవిధానంలో వ్యక్తిగత బ్యాంకు అకౌంట్​‌కు నగదును జమ చేస్తారు. ప్రతి నాలుగు నెలల్లో ఒక గ్యాస్​ సిలిండర్‌ను ఎప్పుడైనా ఉచితంగా పొందే అవకాశాన్ని ​ ప్రభుత్వం కల్పిస్తోంది.


Also Read: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం

బుకింగ్, డెలివరీ, నగదు జమ తదితర సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో ప్రత్యేక కాల్‌ సెంటర్‌కు, గ్రామ స్థాయిలో సచివాలయాల్లో తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు.ఉచిత సిలిండర్‌ పొందేందుకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. తెల్లరేషన్‌ కార్డు కలిగిన లబ్దిదారులందరికీ ఉచిత సిలిండర్‌ అందజేస్తామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో.. ఏ ప్రభుత్వం ఇవ్వని వరం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం.. దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిడర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఇది మా చిన్న కుటుంబాలకు ఎంతో సాయం అంటూ మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. స్వామివారి కానుకలు పొందే అవకాశం మీకోసం.. సర్వదర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Nara lokesh in Atlanta: అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. జగన్‌పై మంత్రి లోకేష్ ఆగ్రహం, త్వరలో రెడ్‌బుక్‌..

Duvvada – Madhuri: జంటగా దీపాలు వెలిగించిన దువ్వాడ, మాధురి.. అసలేం చెప్పారంటే?

Tirumala Darshan : తిరుమలలో సామాన్యులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటా…

Eluru News: దీపావళి రోజు అపశృతి.. అదుపుతప్పిన బైక్.. పేలిన ఉల్లిపాయ బాంబులు.. ఒకరు అక్కడికక్కడే మృతి

Minister lokesh met Google cloud CEO: అమెరికాలో బిజీగా మంత్రి లోకేష్, గూగుల్ క్లౌడ్ సీఈఓ‌తో భేటీ..

Big Stories

×