EPAPER

Chandrababu Reaction: హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించిన చంద్రబాబు… ఏమన్నారంటే..?

Chandrababu Reaction: హర్యానా ఎన్నికల ఫలితాలపై స్పందించిన చంద్రబాబు… ఏమన్నారంటే..?

CM Chandrababu Reaction on Haryana Election Results: హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించింది. ఏకంగా 50కి పైగా సీట్లను దక్కించుకుని రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఫలితాలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేశారు.


Also Read: వద్దని ఎన్నిసార్లు చెప్పినా.. మావాళ్లు వినడంలేదు: వైఎస్ జగన్

‘హర్యానాలో విజయం ఎన్డీఏకు శుభసూచకం. సుపరిపాలన వల్ల వచ్చే లాభాలను ప్రజలు చూశారు. మంచి చేసే ప్రభుత్వాలను ప్రజలు మళ్లీ ఆదరిస్తారు. మోడీ పాలనపై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశంగా చేసేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లోనూ ఎన్ఢీఏకు మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాను. యువత మన దేశానికి గొప్ప బలం. దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.


‘హర్యానాలో బీజేపీ మంచి విజయం సాధించింది. దేశంలో రోజురోజుకు ఎన్డీఏ ఓటు బ్యాంకు పెరుగుతుంది. అతి ముఖ్యమైన విషయమేమంటే.. జమ్మూకాశ్మీర్ లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కాశ్మీర్ లో బీజేపీ గణనీయమైన ఓటు శాతాన్ని సాధించింది. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఎన్డేఏ ప్రభుత్వం అందిస్తున్నది. త్వరలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నది.

విభజన కంటే కూడా వైసీపీ విధ్వంస పాలనతో ఏపీ తీవ్రంగా నష్టపోయింది. సుస్థిరమైన ప్రభుత్వం ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. పార్లమెంటు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరగాలి. మోదీ పాలనను ప్రపంచమంతా కీర్తిస్తుంది. మంచి చేసే ప్రభుత్వాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. 2047లో భారత్ అగ్రదేశంగా మారబోతుంది. మహారాష్ట్ర, జార్ఖండ్ లో కూడా ఎన్డీఏకు మంచి ఫలితాలొస్తాయని ఆశిస్తున్నాను. అయితే, ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో అభివృద్దికి కొంత ఆటంకం కలుగుతుంది. అన్ని ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధఇపై దృష్టి సారించవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసమే రెండురోజులు నా ఢిల్లీ పర్యటన జరిగింది. రాష్ట్ర అవసరాల కోసమే కాదు..దేశ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నాం. యువత భారత్ కు గొప్ప బలం. దేశంలో 7 శాతం వృద్ధిరేటు ఉంది. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగాయి.

Also Read: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు

దేశంలో పీపీపీ విధానంలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. రైల్వేశాఖ ఏపీలో రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. అహ్మదాబాద్ – ముంబై మధ్య బుల్లెట్ రైలు వస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతని కలుపుతూ బుల్లెట్ రైలు రావాలి. పదిరోజులు విజయవాడ వరదల్లో తిరిగాను. సాధారణ పరిస్థితి వచ్చేవరకు కృషి చేశాను. కానీ, కేంద్రం ఇచ్చిన వరద సాయంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని కూడా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు సిగ్గు లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజలంతా మా సేవలను అభినందిస్తున్నారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related News

BIG TV Effect: వాడిపోయిన మామిడాకులు, ఎండిపోయిన పువ్వులు, ‘బిగ్ టీవీ’ ఎఫెక్ట్‌తో దిగొచ్చిన ఇంద్రకీలాద్రి అధికారులు

Jagan: టార్గెట్ లోకేష్.. మేం కూడా ‘బుక్’ రాయడం స్టార్ట్ చేశాం, ఆ పేర్లు ఉంటాయ్: మంగళగిరిలో జగన్ కామెంట్స్

CM Chandrababu: ఇంద్రకీలాద్రిలో ఈసారి ఇది ఏర్పాటు చేశాం.. ఇక భక్తులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదు: చంద్రబాబు

BJP Leader Narendra Viral Video: నాడు అంబటి.. నేడు నరేంద్ర.. ఎవరీ సుకన్య?

Kamalapuram: కమలాపురంలో వైసీపీ ఖాళీ.. జగన్ మేనమామ రవీంద్రనాథ్‌కు టీడీపీ ఝలక్

Anchor Shyamala: ట్రాప్‌లో పడ్డ తమ్ముళ్లు.. వైసీపీ ‘శ్యామలా’ ప్లాన్ సక్సెస్, ఇప్పటికైనా మారతారో లేదో!

Big Stories

×