EPAPER

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

CM Chandrababu Comments: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారంటూ ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. వరద ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇంకా 4 అడుగుల నీరు ఉంది. విజయవాడలో మళ్లీ వర్షం పడింది.. నీళ్లు పెరిగాయి. రేపు కూడా వర్షాలు పడుతాయని అంటున్నారు. కేంద్రానికి పంపేందుకు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశాం. బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు. ఐదేళ్లుగా పులిచింతల, గుండ్లకమ్మ గేట్లను పట్టించుకోలేదు’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

‘ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా ఇస్తున్నాం. ఇవాళ కూడా అందరికీ ఆహారం, మంచినీరు అందించాం. నిన్న, ఇవాళ 66 వేల మందికి నిత్యావసరాలు అందించాం. సరకుల కిట్ ను డిమాండ్ చేసి తీసుకోవాలని కోరుతున్నాను. వరద ప్రాంతాల్లో పాలు, పండ్లను కూడా పంపిణీ చేస్తున్నాం. ఇవాళ రాయితీ ధరపై 64 టన్నుల కూరగాయలు విక్రయించారు. గత వైసీపీ ప్రభుత్వం పాపాల వల్లే ఈ కష్టాలు. మళ్లీ ఇలా ఎప్పుడు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటాం. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చాం. కేంద్రాన్ని మొదటి విడతగా రూ. 6,880 కోట్లు ఇవ్వాలని అడిగాం. బుడమేరుకు శాశ్వత పరిష్కార మార్గం చూపించాలని కోరాం’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.


‘విజయవాడలో ఇంకా ఒక టీఎంసీ నీళ్లు ఉన్నాయి. ఇప్పటివరకు 17 వేల ఇళ్లను శుభ్రం చేశాం. వరద ప్రాంతాల్లోని రోడ్లను 78 శాతం శుభ్రం చేశాం. వైసీపీ హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. బుడమేరును గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరుకు గత ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదు. వర్షాలు కొనసాగుతున్నాయి.. కృష్ణా నదికి మళ్లీ వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇప్పటివరకు బుడమేరుకు 3 గండ్లను పూడ్చాం. గండ్లను పూడ్చిన తరువాత ఒక నమ్మకం వచ్చింది.

Also Read: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే విద్యుత్ ఇవ్వలేదు. వరద బాధితులకు ఇంటింటికీ వెళ్లి సరకులు ఇస్తాం. నెట్ టవర్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పారిశుద్ధ్య పనులు బాగున్నాయని అనేక ప్రాంతాల్లో చెప్పారు. ఇళ్ల సామగ్రి మరమ్మతు చేసేవారు ఎక్కువగా కావాలి. ఇంటి సామగ్రిని శుభ్రం చేసే ఏజెన్సీలతో మాట్లాడుతున్నాం

లక్షా 40 వేల ఇళ్లలోని సామగ్రి పాడైంది. ఉపాధి కల్పించాలని చాలామంది కోరుతున్నారు. కొన్ని కంపెనీలతో మాట్లాడి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్యుమరేటర్లకు రేపు శిక్షణ ఇస్తాం.. ఎల్లుండి నుంచి పంపుతాం. ఈ ప్రాంతంలోని అందరినీ డిజిటల్ లిటరేట్స్ అయ్యేలా శిక్షణ ఇస్తాం.

వరద బాధితులకు సరిపడా క్యాంపులను ఏర్పాటు చేశాం. క్యాంపులు చాలకపోతే హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లు తీసుకోవాలని చెప్పాను. కొన్ని చోట్ల బాధితులు కూడా ముందుకొచ్చి సాయం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు బోట్లు ఎలా వచ్చాయో విచారణ చేస్తాం. బోట్ల రాకలో కుట్ర కోణం ఉంటే మాత్రం ఉపేక్షించం. బోట్ల యజమానులపై అనుమానాలు ఉన్నాయి. దర్యాప్తులో అన్ని విషయాలు బయటపడుతాయి.

Also Read: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

వరద సహాయ చర్యలపై వైసీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారు. రేషన్ కార్డు లేకున్నా నిత్యావసరాలు పంపిణీ చేస్తాం. వైసీపీ నేతలు అన్ని ఖాతాలనూ ఖాళీ చేసి వెళ్లారు’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×