EPAPER

Tdp Politburo: 8న టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్, వాటిపై అధినేత క్లారిటీ..

Tdp Politburo: 8న టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్, వాటిపై అధినేత క్లారిటీ..

Tdp Politburo: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుం ది. ఆగస్టు 8న జరగనున్న భేటీ అజెండాను అధినేత, సీఎం చంద్రబాబు రెడీ చేసినట్టు తెలుస్తోంది. పనిలో పనిగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


ప్రభుత్వ పాలనపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు.. ఇకపై పార్టీపై ఫోకస్ పెట్టారు. ఇందులోభాగంగా ఈనెల (ఆగస్టు) 8న పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. దీనికి తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతోపాటు పొలిట్‌బ్యూరో సభ్యులు హాజరుకానున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి భేటీకి అధిక ప్రాధాన్యత సంతరించుకుంది.

గురువారం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల పంపకం, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సీనియర్ నేతలు చర్చించనున్నారు. పనిలోపనిగా విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నా రు.


ALSO READ: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ ఫోకస్.. బొత్సను ఓడించేందుకు మాస్టర్ ప్లాన్స్

నామినేటెడ్ పోస్టులపై బీజేపీ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో ఇప్పటికే సీఎం చంద్రబాబు పలుమార్లు చర్చించారు. అయితే చర్చల్లో ఓవరాల్‌గా అయితే 60:30:10 నిష్పత్తిలో పంపకాలు చేయాలని నిర్ణయించి నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ గెలిచిన నియోజకవర్గాల్లో 40 శాతం ఆ పార్టీకి, మరో 40 టీడీపీకి, 20శాతం జనసేనకు ఇవ్వాలన్నది అసలు ఆలోచన.

సభ్యత్వ నమోదు విషయంలో ఇప్పటివరకు టీడీపీ ఆ జోలికి వెళ్లలేదు. నామినేటెడ్ పదవుల తర్వాత జిల్లాల అధ్యక్షుల మార్పులు చేర్పులు జరగనున్నాయి. దాని తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా చేయాలని భావిస్తున్నారు. అలాగే కార్యకర్తలకు ఇన్యూరెన్స్‌ను సదుపాయాన్ని వీలైనంత త్వరగా తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో లోకల్ వారికే ప్రయార్టీ ఇవ్వాలన్నది అధినేత ఆలోచనగా సీనియర్లు చెబుతున్నారు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×