CM Chandrababu Emotional: ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ టాక్ షో గడిచిన ఐదేళ్ల రాజకీయ జీవితాల గురించి కీలక విషయాలు వెల్లడించారు సీఎం చంద్రబాబు.
53 రోజుల జైలు జీవితంలో అనుభవించిన కష్టాలు ఒకెత్తయితే, జైలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన మానసిక సంఘర్షణ, వేదన గురించి కళ్లకు కట్టినట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. ఆ సందర్భం చూసినప్పుడు గుండె తరక్కుపోయిందన్నారు. సందేహంగా ఉండే కొన్ని ఘటనలు జరగడం, తానే డీమోరల్ అయితే ఏమీ ఉండదని భావించినట్టు వెల్లడించారు.
ఆనాటి ఘటన నుంచి ధైర్యంగా ఎదుక్కోవడం వల్లే బయటపడ్డానని మనసులోని మాట బయపెట్టారు సీఎం చంద్రబాబు. చనిపోతే ఒక్క క్షణం అనుకున్నాను.. ఆశ్రయం కోసం పని చేస్తే అది శాశ్వతమని భావించి ముందుకు అడుగు వేశానన్నారు. అదే తనను నడిపించదన్నారు.
నంద్యాలలో అరెస్ట్ అయిన దగ్గర నుంచి అమరావతికి వచ్చిన వరకు పడిన కష్టాలను కళ్లకు కట్టినట్టు వివరించారు. తానెప్పుడూ లక్షణ రేఖ దాటలేదన్నారు. తప్పు చేసినవాడ్ని వదిలిపెట్టను.. తప్పు చేయకుంటే వారి జోలికి వెళ్లనని మనసులోని మాట బయటపెట్టారు.
తాను జైలులో ఉంటే కుటుంబమంతా రాజమండ్రిలో ఉందన్నారు సీఎం చంద్రబాబు. తన ధైర్యంతోపాటు ఫ్యామిలీ నుంచి బలమై సపోర్ట్ ఉండడంతో గట్టెక్కానన్నారు. ములాఖత్‌లో కూడా ఇబ్బందులు పెట్టారన్నారు హోస్ట్ బాలకృష్ణ. లోకేష్‌ను ఇబ్బందిపెడితే, ఢిల్లీకి వెళ్లి ఫైట్ చేశారని గుర్తు చేశారు ఏపీ ముఖ్యమంత్రి.
తప్పుడు కేసులో, అక్రమ అరెస్టు చేసి నా ప్రాణాలకే ముప్పు తలపెట్టాలనుకున్నారు..
ఆ దిశగా కొన్ని అనుమానాస్పద చర్యలు ఉన్నాయి.
నేను ఏ దశలో ధైర్యం కోల్పోలేదు.
మరణం ఒక్క క్షణం..
ఆశయ సాధన శాశ్వతం..
ఇదే నా ధైర్యం..
ఇదే నా విజయం..
నిజం నిలిచింది..
న్యాయం గెలిచింది..#ChandrababuNaidu… pic.twitter.com/fwD9opRc8Z— Telugu Desam Party (@JaiTDP) October 26, 2024