EPAPER

Badvel girl murder : బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శ.. రూ.10 లక్షల చెక్కు మంజూరు

Badvel girl murder : బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను సీఎం పరామర్శ.. రూ.10 లక్షల చెక్కు మంజూరు

Badvel girl murder :


బద్వేల్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం
రూ.10 లక్షల చెక్కు మంజూరు
బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడిన సీఎం
సీఎం తరపున చెక్కు అందజేసిన ఇన్ ఛార్జి కలెక్టర్
నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తాననన్న చంద్రబాబు
తల్లికి ఉపాధి కల్పిస్తామని భరోసా
తమ్ముడి చదువుకు అయ్యే ఖర్చుపైనా హామీ

అమరావతి, స్వేచ్ఛ: ప్రేమోన్మాది దాడిలో బలైన కడప జిల్లా ఇంటర్ విద్యార్థిని కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించి బాధితురాలి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మృతి చెందిన విద్యార్థిని తల్లితో ఫోన్ కాల్ చేసి చంద్రబాబు మాట్లాడారు. నిందితుడికి సాధ్యమైనంత తొందరలోనే కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.


ఈ సందర్భంగా రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు మృతురాలి తల్లికి ఉపాధి కూడా కల్పిస్తామని, ఆమె కొడుకు చదువు బాధ్యత తాము తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు కూడా జారీ చేశారు. విద్యార్థినిని పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన తనను ఎంతగానో బాధించిందని సీఎం అన్నారు. ఈ కేసులో నిందితుడికి మరణ శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇకపై ఆడపిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు చేసేవారికి నిందిడుడికి పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలని అన్నారు.

ALSO READ : అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ? వైసీపీ.. టీడీపీ.. బిగ్ బ్రేకింగ్ సీక్రెట్ ఇదేనా ?

ఏం జరిగింది?

ఇంటర్ చదువుతున్న 16 సంవత్సరాల యువతికి స్థానిక హోటల్ లో వంటల చెఫ్ గా పనిచేస్తున్న విఘ్నేష్ తో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ చిన్ననాటి నుంచీ స్నేహితులు. అయితే విఘ్నేస్ కు వివాహం అయింది. భార్య కూడా గర్భిణి. తనని ఆ రోజు అర్జెంటుగా కలవాలని స్నేహితురాలికి ఫోన్ చేశాడు. తాను రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు కూడా. వెంటనే ఆటోలో బయలుదేరిన స్నేహితురాలి ఆటోలో తాను కూడా మధ్యదారిలో ఎక్కాడు విఘ్నేష్. బద్వేల్ కు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ వద్దర ఇద్దరూ దిగి సమీపంలో దట్టంగా ఉన్న ముళ్ల పొదల కేసి వెళ్లారు. కొద్దిసేపటికే వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను స్నేహితురాలిపై పోసి నిప్పంటించాడు విఘ్నేష్. అక్కడి నుంచి వెంటనే పరారయ్యాడు. ఆ చుట్టుపక్కల కొందరు యువతి మంటలనార్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే 80 శాతం కాలిన గాయాలతో ఉన్న బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు కడప పోలీసులు. ఎట్టకేలకు గాలించి నిందితుడు విఘ్నేస్ని అదుపులోకి తీసుకున్నారు.

Related News

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా..!

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Chandrababu – Modi: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు

Nara Lokesh US Tour: అమెరికా వెళ్లిన నారా లోకేష్.. వారం రోజులు అక్కడే.. టార్గెట్ మాత్రం అదే!

Big Stories

×