EPAPER

CM Chandrababu angry: ఏపీలో వరద రాజకీయాలు.. జగన్‌పై సీఎం ఆగ్రహం.. విధి లేక బురదలోకి..

CM Chandrababu angry: ఏపీలో వరద రాజకీయాలు.. జగన్‌పై సీఎం ఆగ్రహం.. విధి లేక బురదలోకి..

CM Chandrababu angry: వరదల్లోనూ ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చంద్రబాబు సర్కార్ చేస్తున్న ప్రతి విషయంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. వరదలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు పులివెందుల ఎమ్మెల్యే జగన్. గడిచిన ఐదేళ్లలో ఏనాడూ వరద ప్రాంతాలను సందర్శించని ఆయన.. నేరుగా బురద నీటిలోకి దిగి ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎప్పటి మాదిరిగానే తన ప్రభుత్వం గురించి చెబుతూ, చంద్రబాబు సర్కార్‌పై నాలుగు రాళ్లు వేసే ప్రయత్నం చేశారు.


వరదలతో బెజవాడ గజగజ వణికింది. పగలు.. రాత్రి తేడా లేకుండా బాధితులకు కలుస్తూ, వారిని నీటిలో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం నుంచి ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఓ వైపు వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తుండగా, మరోవైపు మాజీ సీఎం జగన్ ఎంట్రీ ఇచ్చేశారు.

ALSO READ: సీఎం వచ్చినా కదలని అధికారులు.. చంద్రబాబు సీరియస్


గడిచిన ఐదేళ్లలో ఏనాటి వరద ప్రాంతాలను పెద్దగా సందర్శించని జగన్, నేరుగా బురద నీటిలోకి దిగేశారు. పరదాల జగన్ నేరుగా నీటిలోకి దిగడం చూసి ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వంపై నాలుగు రాళ్లు వేశారు. వైసీపీ ప్రభుత్వం డబ్బా కొట్టే ప్రయత్నం చేశారు.

ఇంకోవైపు వైసీపీ సోషల్‌మీడియాలో తన ప్రచారాన్ని కంటిన్యూ చేసింది. అమరావతి మునిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టేసింది. సీఎం చంద్రబాబు ఇంటి కోసమే ఇదంతా చేస్తున్నారంటూ వండి వార్చింది. గతరాత్రి మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. వరదల గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో వైసీపీ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారాయన.

క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే పరిస్థితులు ఇలాగే ఉంటాయన్నారు సీఎం చంద్రబాబు. బ్యారేజ్ దగ్గరకు రెండు బోట్ల వచ్చాయని అవి ఎక్కడ నుంచి వచ్చాయో తెలీదన్నారు. గేటు డ్యామేజ్‌పై కొంత అనుమానం ఉందని  వ్యక్తంచేశారు. అమరావతిపై పని గట్టుకుని ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బ్లూ మీడియాలో ఇదంతా చేస్తోందని, ప్రతీ విషయంపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.

కొన్ని విషయాల్లో డౌట్‌గా ఉందని, ఎవరినీ వదిలిపెట్టేదన్నారు. ఆ పార్టీలో జరుగుతున్న పరిస్థితులను చూశామని, ఎలాంటి చరిత్ర హీనులున్నారో తెలుస్తోందన్నారు. ఆ పార్టీని భూతంతో పోల్చారు సీఎం. గడిచిన ఐదేళ్లలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సీఎం, మంత్రులు ఎవరైనా ఫీల్డ్ విజిట్‌కు వచ్చారా అంటూ వైసీపీపై బాణాలు సంధించారు సీఎం చంద్రబాబు.

ఒకప్పుడు రెడ్ కార్పెట్ వేసుకుని ఫీల్డ్ విజిట్ చేసేవారని, విధి లేని పరిస్థితిలో బురదలోకి దిగారని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు సీఎం. చెత్త రాజకీయాలు చేయడం, తుఫాను, డిజాస్టర్ గురించి మాట్లాడే నైతికత ఆ పార్టీకి లేదన్నారు. క్రిమినల్ నేచర్‌తో వాళ్లు ఏం చేస్తారో తెలీదన్నారు. వాళ్లే నేరాలు చేసి ఇతరులపై నెట్టేసి దాని ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. బుడమేరు అంటే ఏమిటో నేతలకు తెలీదని, దాని గేట్లు ఉన్నాయని మాట్లాడుతున్నారని, వాళ్లు ఏ విధంగా సీఎం అయ్యారో తెలీదన్నారు. వరద ప్రవాహం నేరుగా వస్తుందని విషయం తెలీదన్నారు.

మా ఇంటిని కాపాడుకోవడానికి బుదమేరకు నీటిని పంపామని అంటున్నారని దుయ్యబట్టారు. అర్థ శతాబ్దంగా ఆ తరహా వరదలు బెజవాడను తాకలేదు.  ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూనే ఉన్నారు. బాధితులకు సహాయక చర్యలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ప్రతీ గంటకు ఒకసారి బోట్లతో ముఖ్యమంత్రి బాధితులను కలిసే ప్రయత్నం చేశారు. బాధితులను దైర్యం చెప్పాల్సిన మాజీ సీఎం, అక్కడ కూడా రాజకీయం చేయడాన్ని ఆ పార్టీలో కొందరు నేతలు తప్పుబడుతున్నారు.

 

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×