Cm Chandra Babu : రాష్ట్రం దారుణంగా తయారైన రోడ్ల పరిస్థితులు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని రోడ్లను గుంతలు లేని రోడ్లుగా మార్చేందుకు కార్యాచరణ చేపట్టిన ప్రభుత్వం.. ఇందుకు గానూ రూ.861 కోట్లు కేటాయించింది. మొట్టమొదటిగా.. సీఎం చంద్రబాబు అనకాపల్లి జిల్లాలో వెన్నెలపాలెంలో స్వయంగా రోడ్లపై గుంతలను పూడ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ సమస్యలు, ప్రభుత్వ విధానాలపై ప్రసంగించారు.
అయితే.. ఈ కార్యక్రమంలో చంద్రబాబు దూకుడు చూసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 75 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహాన్ని చూసి సంబరపడిపోతున్నారు. తమ నాయకుడు.. ప్రజల కోసం ఇంత చురుగ్గా పనిచేస్తుండడం తమకు ఆనందంగా ఉందంటూ చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల్ని పూడ్చేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు.. రోడ్డు రోలర్ ను నడిపారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వెంట రాగా.. వారిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపుతూ, రోడ్డు రోలర్ ఎక్కి నడిపించారు.
ఇప్పుడే కాదు.. మొన్నటి విజయవాడ వరదల సమయంలోనూ చంద్రబాబు వ్యవహరించిన తీరు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇంత లేటు వయసులోనూ ఎక్కడా వెనక్కి తగ్గకుండా.. బెజవాడ కలెక్టర్ ఆఫీస్ లోనే బస చేస్తూ, రోజూ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. ఓ వైపు తన మార్క్ సాంకేతికతలు వినియోగిస్తూ.. డ్రోన్లను రంగంలోకి దించిన బాబు.. మరోవైపు తానూ వరద నీటిలో పడవలపై వెళ్లి బాధితుల్ని పరామర్శించి వచ్చారు. ఆ సమయంలోనూ.. జేసీబీ ఎక్కి లోతట్టు ప్రాంతాల్లో తిరిగారు.
Also Read : చాలా దేశాలు తిరిగాను కానీ.. ఇలాంటి ప్యాలెస్ చూడలేదు – చంద్రబాబు
వరదల్లో కార్లు, ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని సీఎం చంద్రబాబు.. ఏకంగా జేసీబీ లపై ప్రభావిత ప్రాంతాలకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయన చేసిన పనికి.. ప్రతిపక్షాలు సైతం విమర్శించలేని స్థితికి చేరుకోగా, స్వయంగా సీఏం అలా తమ వద్దకు వచ్చే వరకు చాలా ధైర్యం వచ్చింది అంటూ.. బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలా.. వరుస పర్యటనలు, రివ్యూలతో తన మార్క్ పాలనను చూపిస్తున్న చంద్రబాబు, ప్రజలకు అవసరమైన సందర్భాల్లో కొత్తగా వ్యవహరిస్తూ… బాసూ నీ స్టైలే వేరు.. అనేలా చేస్తున్నారు.