EPAPER

Chandrababu to attend NDA Meeting: ఢిల్లీకి చంద్రబాబు, రేపు ఎన్డీయే భేటీకి హాజరు..!

Chandrababu to attend NDA Meeting: ఢిల్లీకి చంద్రబాబు, రేపు ఎన్డీయే భేటీకి హాజరు..!

Chandrababu to attend NDA Meeting: కేంద్రంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చక్రం తిప్పబోతున్నారా? అవుననే సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్రంలోని బీజేపీ దూతలు అమరావతిలోని చంద్రబాబు ఇంటికి వచ్చారు. వచ్చిన ఫలితాలపై నేతలంతా చర్చించుకున్నారు.


ఢిల్లీలో బుధవారం జరగనున్న ఎన్డీయే సమావేశానికి రావాలని చంద్రబాబును కమలనాథులు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. చంద్రబాబుతోపాటు పవన్‌ కల్యాణ్ కూడా వెళ్తారా? అన్నదే అసలు పాయింట్. ఎందుకంటే జనసేన రెండు ఎంపీ సీట్లను గెలుచుకోనుంది. ఒకటి కాకినాడ, మరొకటి మచిలీపట్నం. కేంద్రంలోని ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన కీలక కానున్నారు. ఈ క్రమంలో పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం.

మరోవైపు బీజేపీకి పూర్తి మెజార్టీ వస్తుందని సర్వేలు చెప్పాయి. కమలనాధులు వేసిన అంచనాలు అనుగుణంగానే సీట్లు వచ్చాయి. కాకపోతే గెలుపు తమదేనంటూ పైకి గుభనంగా వ్యవహరించారు. ఎన్డీయే కూటమి ఇప్పటివరకు 280 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. కొన్ని సీట్లను మాత్రమే గెలుచుకుంది. చంద్రబాబు లాంటి మిత్రలు లేకపోతే బీజేపీకి కష్టమని బీజేపీ పెద్దలు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.


ALSO READ: ఏపీ ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసుల హవా, అందరూ గెలుపు..

పరిస్థితి గమనించిన కమలనాథులు చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపినట్టు నేషనల్ మీడియాలో వార్తలు జోరందుకున్నాయి. అటు ఇండియా కూటమి కూడా 230 పైచిలుకు స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇక ఇతరులు 18 మంది ఉన్నారు. పరిస్థితి గమనించిన బీజేపీ, బుధవారం ఎన్డీయే సమావేశం ఏర్పాటు చేస్తోంది. అటు కాంగ్రెస్ నేతలు తమ కూటమి సభ్యులతో మంతనాలు చేస్తోంది. రేపోమాపో ఆయా నేతలు కూడా భేటీ కానున్నారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత చంద్రబాబు అవసరం కేంద్రంలోని పార్టీలకు అవసరమొచ్చిందన్నమాట.

Tags

Related News

YCP vs Janasena: జనసేనలోకి చేరికలు.. కూటమిలో లుకలుకలు

ysrcp petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, కాకపోతే కోర్టు..

Ex MP Nandigam Suresh’s house: ఇదేం కేసు.. వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో సోదాలు, నోటీసులిచ్చిన పోలీసులు

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Big Stories

×