EPAPER

CM Chandra Babu: ఆ పేదింటిలో.. స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టిన సీఎం చంద్రబాబు

CM Chandra Babu: ఆ పేదింటిలో.. స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టిన సీఎం చంద్రబాబు

ఏపీలో అధికారంలోకి వచ్చిన తరవాత టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన మార్క్ పాలనతో ప్రజలకు మరింత దగ్గర అవుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే నేడు సీఎం ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపినీ పథకాన్ని ప్రారంభించారు. నేడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం నుండి పథకాన్ని ప్రారంభించి ఉచిత సిలిండర్లు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఆయన అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి ఉచిత సిలిండర్ అందజేయడంతో పాటూ తానే స్వయంగా స్టవ్ వెలిగించి టీ పెట్టడం విశేషం. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ ఉండగా వారితో సరదాగా మాట్లాడుతూ చంద్రబాబు టీ పెట్టారు. పాలు ఉన్నాయా అమ్మా..అందరికీ టీ పెట్టి ఇవ్వు అని శాంతమ్మతో జోకులు వేశారు. అంతే కాకుండా రామ్మోహన్ ఈ టీ కి డబ్బులు సెంట్రల్ నుండి తీసుకురావాలంటూ నవ్వులు పూయించారు.

ఇదివరకు కట్టెలపొయ్యిపై ఎలా వంట చేసేదానివని శాంతమ్మను అడగగా చాలా కష్టంగా ఉండేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాళ్ల నొప్పులు, ఒంటినొప్పులు ఉండేవని చాలా కష్టం అని తెలిపారు. తొమ్మిది సంవత్సరాల క్రితం మీరు అధికారంలోకి వచ్చినప్పుడే ఉచిత సిలిండర్ ఇచ్చారని శాంతమ్మ చంద్రబాబుతో చెప్పారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం చంద్రబాబు అక్కడ ఉన్నవారితో కలిసి టీ తాగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు టీ పెట్టి పేదింట్లో వారితో సరదాగా జోకులు వేస్తూ గడపడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Related News

GIRL MARRIAGE: ఆడపిల్ల పెళ్లిపై హైకోర్టు కీల‌క వ్యాఖ్యలు..పెళ్లైతే అంతేనా?

PAWAN KALYAN: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌తీస్తాం..రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్..!

Deepam Scheme : ఏపీలో కూటమి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు.. కానీ మంచి మనసు ఉంది – చంద్రబాబు

NAGABABU: టీటీడీ కొత్త ఛైర్మ‌న్‌పై నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్..!

Chintamaneni Angry: దెందులూరులో ఏం జరిగింది? చింతమనేని ఆగ్రహం వెనుక..

AP Free Gas Cylinders: ఈ రోజు నుంచే ఫ్రీ గ్యాస్ సిలిండర్లు.. బుకింగ్స్ కొత్త రూల్స్ ఇవే..

Big Stories

×