EPAPER

Chandrababu Naidu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం ముహూర్తం ఛేంజ్.. ఎందుకంటే?

Chandrababu Naidu Swearing Ceremony: చంద్రబాబు ప్రమాణస్వీకారం ముహూర్తం ఛేంజ్.. ఎందుకంటే?

Chandrababu Naidu Swearing Ceremony: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ నేతృత్వంలోని టీడీపీ సునామీ సృష్టించింది. బీజేపీ, జనసేన పార్టీలతో జతకట్టి వైసీపీ ఫ్యాన్ రెక్కలను విరగొట్టింది. జూన్ 4వ తేదీన వెలువడిన ఫలితాల్లో కూటమికి స్పష్టమైన మెజార్టీ రావడంతో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం కోసం తేదీలను ఫిక్స్ చేసే పనిలో పార్టీ వర్గాలు నిమగ్నమయ్యారు. మొదట జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయాలని ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే, తాజాగా, ప్రమాణ స్వీకారం తేదీ విషయంలో స్వల్ప మార్పు చేసినట్లు సమాచారం. అమరావతి వేదికగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.


ఢిల్లీ వెళ్లనున్న బాబు.. తర్వాతే స్పష్టత

టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ భేటీ కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబుతో కలిసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారు. వీళ్లతో పాటు తెలంగాణ బీజేపీ నేతలు, జేడీయూ నేతలు సైతం పాల్గొననున్నారు. ఈ సమావేశం తర్వాతనే ఏపీలో ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నందున ఎన్డీఏ నేతలు రాష్ట్రపతి ద్రైపది ముర్మును కలిసి మోదీకి మద్దతు ప్రకటించే విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 9న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరైన తర్వాతే అమరావతికి తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ నేపథ్యంలో సమయం సరిపోని సమక్షంలో జూన్ 9న ఫిక్స్ చేసిన తేదీని జూన్ 12కు మార్పు చేసే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి.


Also Read: బిగ్ బ్రేకింగ్, ఛైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజీనామా!

ఉండవల్లిలో భారీ భద్రత…

ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రానుంది. దీంతో చంద్రబాబు ఓవరాల్‌గా సీఎంగా నాలుగోసారి, విభజన ఆంధ్రప్రదేశ్‌లో రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం వేదిక కోసం అమరావతిలోని పలు ప్రాంతాలను అధికారులతోపాటు టీడీపీ నేతలు జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాయపూడిని పరిశీలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసం 50కు పైగా లారీల్లో సామగ్రి సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతోపాటు ఇద్దరు ఏఎస్పీల ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

సరికొత్త చరిత్ర సృష్టించనున్న చంద్రబాబు

నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టనున్నారు. దీంతో నాలుగు సార్లు సీఎం పదవి చేపట్టిన తెలుగు నాయకుడిగా చంద్రబాబు రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా అంటే 14 ఏళ్లు అనుభవానికి మరో 5 ఏళ్లు కలిపితే.. మొత్తం 19 ఏళ్లు అవుతోంది. ఇదే జరిగితే చంద్రబాబు సరికొత్త చరిత్ర లిఖించనున్నారు. అమరావతిలో జరిగే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మోదీతోపాటు ఎన్డీఏ నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు. కాగా, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన తేదీతోపాటు ప్రాంతంపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

Related News

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

Big Stories

×