BigTV English

Chandrababu: ఓవర్ టు కుప్పం.. తమ్ముళ్లతో 3 డేస్ మారథాన్ మీటింగ్స్..

Chandrababu: ఓవర్ టు కుప్పం.. తమ్ముళ్లతో 3 డేస్ మారథాన్ మీటింగ్స్..
Chandrababu-kuppam-tour

Chandrababu naidu latest news(AP Politics): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఆయన తన సొంత నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సభలు, రోడ్ షోలను సర్కారు టార్గెట్ చేస్తుండటంతో.. ఈసారి గతానికి భిన్నంగా పార్టీ శ్రేణులతో సమావేశాలకు మాత్రమే పరిమితం కానున్నారు. రానున్న ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజార్టీ లక్ష్యంగా పావులు కదుపుతున్న చంద్రబాబు.. ఆ దిశగా తెలుగు తమ్ముళ్లకు దిశానిర్ధేశం చేయనున్నారు.


బూత్‌ స్థాయినుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలకు వేర్వేరుగా సమావేశాలు జరగనున్నాయి. ఈ దఫా ఎన్నికలు ఎంత ముఖ్యమో, ఎంత నిబద్ధతతో, బాధ్యతతో గెలుపు కోసం కృషి చేయాలో పార్టీ శ్రేణులకు వివరించనున్నారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ బీఆర్‌ సురేశ్‌బాబు టీడీపీలో చేరనున్నారు. ఈనెల 15వ తేదీన జరిగే బహిరంగ సభలో పెద్దఎత్తున అనుచరులతో కలిసి ఆయన పార్టీలో చేరనున్నారు. అలాగే వైసీపీ నుంచి కూడా భారీగానే వలసలు జరుగుతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలామంది ఆ పార్టీవారు లైన్లో ఉన్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.


రాష్ట వ్యాప్తంగా రాజకీయాలలో సోషియల్ ఇంజనీరింగ్ చేసిన చంద్రబాబు కుప్పంలో మాత్రం ఆ విధానాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. దీంతో మెజార్టీ సామాజిక వర్గం పార్టీకి దూరం అవుతూ వచ్చింది. ముఖ్యంగా వన్నెకుల సామాజిక వర్గానికి చెందిన వారికి పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా.. గాండ్ల సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం మైనస్ అయ్యింది. ఇక చంద్రబాబు వ్యక్తి గత కార్యదర్శి మనోహర్ పెత్తనం ఎక్కువ కావడం పార్టీకి కొంత నష్టాన్ని చేసిందన్న అభిప్రాయాలున్నాయి. మరోవైపు పార్టీలో యువతను విస్మరించడంతో.. వారంతా టీడీపీకి దూరమయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ కుప్పంపై స్పెషల్ ఫోకస్ పెట్టడం.. ఈసారి చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని పంతం పట్టడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు మునుపెన్నడూ లేనంతగా కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్ చేజారకుండా.. మరింత బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, చంద్రబాబు వచ్చిన ప్రతీసారి అధికార పార్టీనో, పోలీసులో ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం పరిపాటుగా మారింది. మరి, ఈసారి చంద్రబాబు కుప్పం టూర్ ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందో?

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×