EPAPER

Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. టీడీనీ ఆధ్వర్యంలో ‘రా కదలి రా’ బహిరంగ సభను తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు. ఈ సభలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సందర్భంలో వెంకటగిరి తలరాత మారుస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారన్నారు. మరి తలరాత మారిందా ? అని బాబు ప్రశ్నించారు. వైసీపీలో ఉండే ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్‌ పాలన బాగోలేదని చెప్పారన్నారు. ఆనం.. ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టారన్నారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని చంద్రబాబు దుయ్యబట్టారు.

Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. టీడీపీ ఆధ్వర్యంలో ‘రా కదలి రా’ బహిరంగ సభను తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు. ఈ సభలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సందర్భంలో వెంకటగిరి తలరాత మారుస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారన్నారు. మరి తలరాత మారిందా ? అని బాబు ప్రశ్నించారు. వైసీపీలో ఉండే ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్‌ పాలన బాగోలేదని చెప్పారన్నారు. ఆనం.. ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టారన్నారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని చంద్రబాబు దుయ్యబట్టారు.


ఎన్టీఆర్, వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా ఆనం రాంనారాయణరెడ్డి పని చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే ఆనంను పక్కన పెట్టారని మండిపడ్డారు. శిషుపాలుడు వంద తప్పులు చేస్తే, ఈ సైకో జగన్ వెయ్యి తప్పులు చేశారని విమర్శించారు. కుటుంబంలో ఇంటి పెద్ద సరిలేకుంటే కుటుంబం బాగుంటుందా ? అని బాబు ప్రశ్నించారు. అందరి చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉందన్నారు. ఆ ఆయుధంతో జగన్ అహంకారానికి ముద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం ఏపీలో విధ్వంసం కొనసాగుంతుందని చంద్రబాబు ఆరోపించారు. కనీసం సంక్రాంతి పండుగ కూడా చేసుకోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకి జీతాలు పెంచే పరిస్థితి లేదన్నారు. జీతాలు అడిగితే జైలుకి పంపుతారనే భయం ఉద్యోగుల్లో ఉందని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందన్నారు. అందుకే అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. 82 రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.


టీడీపీ హాయంలో తుపానులు, వరదలు వచ్చినప్పుడు ఒక్కో కుటుంబానికి‌ రూ.10వేలు ఇచ్చి ఆదుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఏ కులస్థులైనా బాగున్నారా? ఏ మతస్థులైనా బాగున్నారా? కనీసం రెడ్లు అయినా బాగున్నారా?.. అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేని పరిస్థతి ఉందన్నారు. దీనికి ఒక్కటే మార్గమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలన్నారు. మనం అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని బాబు ప్రజలకు పిలుపునిచ్చారు.

యువత కోసం 25 ఏళ్ల కిందట ఐటీ అనే ఆయుధం ఇస్తే, ఇప్పుడదే వజ్రాయుధం అయ్యిందని చంద్రబాబు అన్నారు. టీడీపీ హాయంలో తిరుపతి, నెల్లూరు, చెన్నైని ఒక హబ్‌గా చేద్దామని అనుకున్నామన్నారు.. ప్రపంచంలోనే మేలైన ప్రాంతంగా చేయాలని చూశామన్నారు. ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్‌గా చేద్దామని అనుకున్నామని తెలిపారు. మంచి పరిశ్రమలు, విద్యాసంస్థలు తీసుకువచ్చి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెద్దామనున్నామని బాబు గుర్తు చేశారు.

తెచ్చిన వాటిని జగన్ ధ్వంసం చేశారని బాబు దుయ్యబట్టారు. రూ.16లక్షల కోట్లు పెట్టుబడులు టీడీపీ తెస్తే, జగన్ నిరుద్యోగం పెంచారని ఆరోపించారు. తమ హాయంలో కియా వంటి పరిశ్రమలు తెస్తే, వాటికే కన్నం వేశారీ.. జగన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ హాయంలో ఐటీ ఉద్యోగాలిస్తే, జగన్ వాలంటిర్ల ఉద్యోగాలు, బ్రాందీ షాపులో ఉద్యోగాలు, పిష్ మార్కెట్ ఉద్యోగాలిచ్చారని మండిపడ్డారు. టీడీపీ పరిశ్రమలు తెస్తే… జగన్ భూంభూం, ఆంధ్రా గోల్డ్, ప్రెసిడెంట్ మెడల్ తెచ్చారన్నారు. రాష్ట్రంలో హోల్ సేల్, రిటైల్ వ్యాపారమంతా ఆయనదే అని విరుచుకుపడ్డారు.

జగన్ ఓ పెద్ద వ్యాపారి అని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని మొత్తం వ్యాపారం పేరుతో దోచుకున్నారని దుయ్యబట్టారు. ఇసుక తైలం తీసి రూ.కోట్లు దోచారని బాబు ఆరోపించారు. తిరుపతిలో రూ.4వేల కోట్ల పీడీఆర్ బాండ్లు పేరుతో దోచారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.24 వేల కోట్లు దోచాడన్నారు. తిరుపతి ప్రాంతంలో ఎర్రచందనం ఉంది. ఆ రోజు స్మగ్లింగ్ చేసే వారిపై గట్టిగా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఈ రోజు ఒక్కరినైనా పట్టుకున్నారా? అని ప్రశ్నించారు. అయోధ్యలో రామాలయం నిర్మిస్తే దేశమంతా చూస్తుందన్నారు. తిరుమలలో స్వామి ఆలయాన్నీ దోచుకుంటున్న జగన్ ను ఆ దేవుడు క్షమించినా.. రాష్ట్ర ప్రజలు క్షమించరని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్ హౌసింగ్ కాలనీల్లో రూ.15లక్షలకే ఎకరాల భూమి కొనుగోలు చేసి, ప్రభుత్వానికి రూ.50కోట్లకి అమ్మారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో కొండలు, గుట్టలు, చెరువులు అన్నీ మాయమయ్యాయన్నారు. రూ.4500కోట్ల విలువ చేసే సిలికానినీ వైసీపీ దుర్మార్గులు దోచేశారని దుయ్యబట్టారు. సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారని బాబు అన్నారు. రాష్ట్రంలో మైనింగ్ లను కేజీఎఫ్ త్రీగా మార్చేశారన్నారు. రాష్ట్రంలో మైనింగ్ లు ప్రజల సంపద ప్రజలకే చెందాలని మాజీ మంత్రి సోమిరెడ్డి నిరాహార దీక్షకి దిగి పోరాటం చేశారన్నారు. జగన్ 45 లక్షల మంది భవన నిర్మణ కార్మికుల పొట్టకొట్టి తన జేబు నింపుకున్నారన్నారు. ఇసుకంతా దోచేశరన్నారు. జగన్ మొన్న బీచ్ శ్యాండ్ ను అమ్మాలని చూస్తే కోర్టు ఆపిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఇన్ని అక్రమాలు, అవినీతికి పాల్పడిన జగన్ ను ప్రజలు క్షమించే పరిస్థితి లేదన్నారు. అందుకే రాష్ట భవిష్యత్తు బాగుండాలంటే “జగన్ పోవాలి.. ప్రజలు గెలవాలి” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అనంతరం వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిందన్నారు. ఈ జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలం అధికార పార్టీని వీడి తెడీపీ అధినేత చంద్రబాబుతో నడిచేందుకు వచ్చామన్నారు. వెంకటగిరిలో నిర్వహించిన ‘రా.. కదలి రా..’ సభలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మాఫియా గ్యాంగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. దానిపై గతంలో పోలీసుల సభలోనే మాట్లాడినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్రమంతా ఈ సంస్కృతి పెరిగిపోయిందన్నారు. అప్పటి నుంచే తనపై జగన్ కక్షగట్టారన్నారు. వెంకటగిరి అభివృద్దికి ఏది కావాలని అడిగినా.. ఆ అభ్యర్థనలను చెత్తబుట్టలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులు కావాలని తాను అడగలేదన్నారు.. పట్టణానికి వంద పడకల ఆస్పత్రి నిర్మాణం, సోమశిల-స్వర్ణముఖి లింక్‌ కాలువకు నిధులు కోరితే బుట్టదాఖలు చేశారన్నారన్నారు.

జగన్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల నిధులు మళ్లించారని ఆనం ఆరోపించారు. ఆ డబ్బు ఇవ్వాలని కోరితే తన నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు. సోమశిల ప్రాజెక్టుకు సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×