EPAPER

CID Raids on Distileries: మద్యం డిస్టిలరీలపై సీఐడీ దాడులు, జగన్ ఉక్కిరి బిక్కిరి.. బండారం బయటకు

CID Raids on Distileries: మద్యం డిస్టిలరీలపై సీఐడీ దాడులు, జగన్ ఉక్కిరి బిక్కిరి.. బండారం బయటకు

CID Raids on Distileries: మద్య కుంభకోణంలో సంచనాలు నమోదు కానున్నా యా? ఏపీ అంతటా మద్యం డిస్టిలరీల్లో సీఐడీ దాడుల వెనుక ఏం జరుగు తోంది? ఎందుకు మాజీ సీఎం జగన్ టెన్షన్ పడుతున్నారు? ఏపీ బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి బండారం బయటపెట్టారా? దాని ఆధారంగా సీఐడీ దాడులు చేస్తోందా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీది వెయ్యి రెట్లు పెద్దదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


లిక్కర్ అవినీతిలో గత వైసీపీ పాలకుల బండారం బద్దలవుతుందా? మంగళవారం ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా మద్యం డిస్టిలరీల్లో సోదాలు చేపట్టింది సీఐడీ. ఉమ్మడి ప్రతి జిల్లాల్లో రెండేసి ప్రాంతాల చొప్పున ఈ సోదాలు జరిగాయి.

మద్యం ఉత్పత్తికి, షాపుల్లో విక్రయాలకు భారీ తేడా వున్నట్లు గుర్తించారు. డిస్టిలరీల(Distileries) నుంచి బేవరేజేస్ కార్పొరేషన్‌కు ఎంత మద్యం సరఫరా చేశారు? బాట్లింగ్ యూనిట్లలో నిల్వ, సరఫరా వివరాలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మద్యం తయారీ నాణ్యత పాటించారా? లేదా? ఇలాంటి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొన్నింటిని అధికారులు తీసుకెళ్లినట్టు సమాచారం.


వైసీపీ నేతలతో అప్పటి ఎక్సైజ్ అధికారులు చేతులు కలిపినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అధిక కమిషన్లు ఇచ్చినవారికే ఎక్కువగా మద్యం ఆర్డర్లు ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వం వెనుక త్రిమూర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డొంక విప్పే పనిలో సీఐడీ పడింది.

ALSO READ: 30వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.. భక్తులకు టీటీడీ కీలక సూచన.. దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

100 శాతం మద్యంలో కేవలం 60శాతం మాత్రమే లెక్కలు చూపించారట. మిగతా 40శాతం సొమ్ములు ఎక్కడికి వెళ్లాయో? ఏమయ్యాయో తెలీదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంతా క్యాష్ మీద మద్యం అమ్మకాలు సాగాయి. ఎక్కడా ఆన్‌లైన్ పేమెంట్ తీసుకోలేదు. చివరి ఏడాదిలో కొంత ఆన్‌లైన్ చేసినట్టు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన వైట్ పేపర్స్ ద్వారా తెలిసింది.

మద్యంలో వచ్చిన సొమ్ములతో ఎన్నికల ముందు కొందరు నేతలు తమ బినామీల మీద భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు అంతర్గత సమాచారం. ఈ తతంగమంతా విశాఖ, విజయవాడలో ఎక్కువగా జరిగినట్టు ప్రభుత్వ వర్గాల మాట.

ఒక్కసారి వెనక్కి వెళ్దాం.. మూడు నెలల కిందట ఏపీ బేవరేజేస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. ఆ సమయంలో కీలక పేపర్లను స్వాధీనం చేసుకుంది. అయితే ఆగస్టులో బెంగుళూరులో సీఐడీ చేతికి చిక్కారు వాసుదేవరెడ్డి. ఆయన్ని అరెస్ట్ చేయకుండా జాగ్రత్తగా సమాచారాన్ని సేకరించారు అధికారులు.

ఒకవేళ ఆయన్ని అరెస్ట్  చేస్తే  ఏదో విధంగా తప్పించుకునే అవకాశముందని భావించారు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా డిస్టిలరీ యజమానుల వద్దకు వెళ్లి డీటేల్స్ సేకరించారు. సమాచారం ఇవ్వడానికి కొందరు మొండికేశారు. దీంతో అధికారులు రూట్ మార్చి మొత్తం సమాచారాన్ని సేకరించారట.

ప్రస్తుతం డిస్టిలరీల్లో తయారు చేస్తున్నప్పుడు ఏమైనా ప్రమాదకరమైన ఆల్కహాలు కలిపారా? అనేదానిపై ఆరా తీశారు. 40 శాతం మద్యం క్యాష్ ఎక్కడికి వెళ్లింది? ఇంకో విషయం ఏంటంటే ప్రతి జిల్లాలో వైసీపీకి చెందిన నేత ఈ తతంగాన్ని నడిపినట్టు తెలుస్తోంది. రెండు లేదా మూడు వారాల్లో లిక్కర్ వ్యవహారంలో సంచలనాలు నమోదు కావడం ఖాయమని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Related News

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Chandrababu – Modi: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. అమరావతికి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు

Big Stories

×