EPAPER

TDP BJP Alliance: బీజేపీకి ఎన్ని టికెట్లు?..ఎవరికి ఎర్తు..?

TDP BJP Alliance: బీజేపీకి ఎన్ని టికెట్లు?..ఎవరికి ఎర్తు..?

TDP BJP Alliance(Breaking news in Andhra Pradesh): ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. 2014 ఎన్నికల నాటి పొలిటికల్ ఈక్వేషన్లు స్క్రీన్‌పైకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా బీజేపీ పెద్దలను కలవడానికి చంద్రబాబు హస్తిన వెళ్లడంతో అతి త్వరలోనే పొత్తులపై క్లారిటీ రానుంది. ఇప్పటికే టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాబు ఒక కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తున్న నేపధ్యంలో.. బీజేపీ కూడా కూటమిలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. మరి సీట్ల విషయంలో బీజేపీ పెట్టే కండీషన్స్‌కి టీడీపీ అధినేత ఓకే చెప్తారా? లేకపోతే టీడీపీ ప్రతిపాదించే సీట్లతో బీజేపీనే సర్దుకుపోతుందా? అడిగినన్ని సీట్లు ఇవ్వలేదని కాషాయ పార్టీ దూరం జరుగుతుందా? అన్న అంశాలు అన్ని పార్టీలో ఉత్కంఠ రేపుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల లెక్కలు మారే పరిస్థితి కనిపిస్తోంది. నిన్న, మొన్నటి వరకు టీడీపీ, జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. అయితే ఇప్పుడు బీజేపీ పెద్దలతో భేటీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడంతో.. పొత్తుల లెక్కలు మారే పరిస్థితి కనిపిస్తోంది. కూటమిలో చేరడంపై ఇన్నాళ్లు బెట్టు చేస్తూ వచ్చిన బీజేపీ.. ఒక్కసారిగా కూటమిలో చేరేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఆ చర్చల కోసమే చంద్రబాబు హస్తిన వెళ్లిన్నట్లు చెపుతున్నారు. మొత్తానికి టీడీపీ, జనసేన కోరుకుంటున్నట్టే రాష్ట్రంలో పొత్తు కుదిరే చాన్స్‌ కనిపిస్తోంది.

ఏపీలో పొత్తు పెట్టుకునేందుకు మొన్నటి వరకు ఆసక్తి చూపించని బీజేపీ పెద్దలు ఇప్పటికప్పుడు. పొత్తు దిశగా చర్చలకు సిద్ధం కావడానికి కారణం ఎంపీ సీట్ల లెక్కలేనని చెబుతున్నారు. తాజాగా పార్లమెంట్‌లో ప్రధాని మోడీ బీజేపీ సోలోగా 370 సీట్లు, మిత్రపక్షాలతో కలిపి 400 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


అందులో భాగంగా దక్షిణాదిన జేడీఎస్, టీడీపీ, జనసేనతో పొత్తుతో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెపుతున్నారు. ఆ లెక్కలతోనే ఏపీలో కూటమి నుంచి అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే హడావుడిగా టీడీపీతో టచ్‌లోకి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 15 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాల్లో పోటీ చేసింది. అప్పుడు తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీనే వెంపర్లాడింది. అప్పట్లో టీడీపీ ఆ పార్టీకి 15 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలను కేటాయించింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు జనసేన పోటీ చేయబోతోంది. ఇక పవన్‌ పార్టీకి 25 అసెంబ్లీ సీట్లు, మూడు లోక్ సభ సీట్లు కేటాయించాలని టీడీపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని సీట్ల కోసం జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ గతంలో ఇచ్చిన సీట్లు దక్కడమే గగనమంటున్నారు.

అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత పొత్తులు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ రానుంది. ఈ సారి తమ మిత్రపక్షమైన జనసేన పోటీ చేస్తుండటం.. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ ఒక్క శాతం ఓట్లు కూడా దక్కించుకోలేక పోవడం వంటి అంశాలను ద‌ృష్టిలో పెట్టుకుని .. బీజేపీ 13 అసెంబ్లీ 3 ఎంపి స్థానాలు అడిగే అవకాశం కనిపిస్తోంది.

పొత్తుల లెక్కల్లో జనసేనకు 25 నుంచి 27 అసెంబ్లీ స్థానాలు కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పొత్తు ఖాయమైతే బీజేపీకి కనీసం 10 స్థానాలు ఇవ్వాల్సి ఉంటుందని.. అదే విధంగా జనసేనకు 2, బీజేపీ కనీసం 3 ఎంపీ స్థానాలు కేటాయించాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అంటే 35 నుంచి 40 అసెంబ్లీ సెగ్మెంట్లు, 5 ఎంపీ సీట్లు మిత్రపక్షాలకు వెళ్తాయి. అక్కడ టీడీపీ టికెట్లు ఆశిస్తున్న వారిని సముదాయించడం టీడీపీ అధినేతకు పెద్ద తలనొప్పే.

దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు బీజేపీకి 5 నుంచి 8 అసెంబ్లీ స్థానాలు 3 లోక్‌స్థానాలు కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ ముఖ్యనేతల చెప్తున్నారు. అరకు, రాజమండ్రి, రాజంపేట ఎంపీ స్థానాలు బీజేపీకి కేటాయించాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ మాత్రం నరసరావుపేట, విజయవాడ, రాజంపేట ఆశిస్తోందంటున్నారు. తమ పార్టీలో టీడీపీ మాజీ ఎంపీ సుజనాచౌదరిని బరిలోకి దింపడానికి బీజేపీ విజయవాడ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అలా సీట్ల సర్దుబాటుపై రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నా.. ఢిల్లీ వెళ్లే ముందు సీట్ల కేటాయింపు పై పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు మంతనాలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే జనసేనతో పొత్తు కారణంగా దాదాపు 25 నుంచి 30 సీట్లు కోల్పోయే పరిస్థితి ఉండటంతో.. రాష్ట్రంలో బీజేపీ బలాన్ని దృష్టిలో పెట్టుకుని.. పరిమితంగా సీట్లు కేటాయించాని నేతలు సూచించినట్లు తెలిసింది.

బీజేపీ కోరినన్నీ సీట్లు ఇస్తే పార్టీలో నేతల్లో వ్యతిరేకత వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అయిందంట. టీడీపీకి కీలకమైన స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో మిత్రపక్షాలకు కేటాయించవద్దన్న అభిప్రాయం కూడా వ్యక్తమైందంట.. కీలక స్థానాలను వదులుకుంటే భవిష్యత్తులో పార్టీ నష్టపోతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారంట సీనియర్లు.. అదే సమయంలో బీజేపీతో పొత్తు కొన్ని వర్గాలను పార్టీకి దూరం చేస్తుందనే వాదన ఈ చర్చల సమయంలో ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. వారి వాదనలతో ఏకీభవిస్తూనే.. ఎన్నికల సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతు అవసరమని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.

మొత్తమ్మీద బీజేపీకి 8 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు కేటాయించాలని ఫిక్స్ అయి.. టీడీపీ అధినేత ఢిల్లీ వెళ్లారంట. మరి భేటీలో అమిత్ షా నుంచి ఎలాంటి ప్రతిపాదన వస్తుంది? చంద్రబాబు ప్రతిపాదించే సంఖ్యకి బీజేపీ అంగీకరిస్తుందా? పొత్తు ఖాయం అవుతుందా లేదా అనే ఉత్కంఠ ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది.

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×