EPAPER

Chandrababu compares Jagan to pablo Escobar: జగన్‌ని ఎస్కోబార్‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు?

Chandrababu compares Jagan to pablo Escobar: జగన్‌ని ఎస్కోబార్‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు?

Chandrababu compares Jagan to pablo Escobar: ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ అధి నేత జగన్ ఎందుకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? చంద్రబాబు సర్కార్‌ని చూసి భయం మొదలైందా? జగన్ ఎందుకు తత్తరబాటు పడుతున్నారు? చంద్రబాబు సర్కార్ పెట్టబోయే కేసుల గురించి తెలిసి ముందే స్కెచ్ వేసుకున్నారా? ఆ ప్లాన్ ప్రకారమే చంద్రబాబు సర్కార్‌పై జగన్ బురద జల్లుతున్నారా? జగన్‌ని కొలంబియా డ్రగ్ లార్డ్ ఎస్కోబార్‌‌తో సీఎం చంద్రబాబు ఎందుకు పోల్చారు? అన్న ప్రశ్నలు ఏపీ అంతటా రైజ్ అవుతున్నాయి.


ఏపీ ఎన్నికల ప్రచారంలో జగన్‌ను ఉత్తర‌కొరియా నియంత కిమ్‌తో పోల్చారు. ఎన్నికల్లో ఈ విషయం మేజర్‌గా హైలెట్ అయ్యింది. ఇప్పుడు కొలంబియా డ్రగ్స్ అధినేత ఎస్కోబార్‌తో పోల్చారు సీఎం చంద్ర బాబు. గురువారం ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక విషయాలు వెల్లడించారు. అసెంబ్లీలోఉన్న 80మంది ఎమ్మెల్యేలపై వైసీపీ సర్కార్ కేసులు పెట్టిందన్నారు. జగన్ తన సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారో వివరించారు సీఎం.

ఇదే సమయంలో ఒకప్పటి కొలండియా డ్రగ్స్ అధినేత ఎస్కోబార్ చేసిన నేరాలను వివరించారు. కేవలం డ్రగ్స్‌తో ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకడిగా ఎదిగాడని గుర్తు చేశారు. అధికారులను తన చేతిలో పెట్టుకునేందుకు చేసిన దారుణాలను వివరించారు సీఎం చంద్రబాబునాయుడు. వీలైతే దానిపై తెరకెక్కించిన సినిమా చూడాలని సభ్యులు, ప్రజలకు సూచన చేశారు.


ALSO READ: నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరు తొలగింపు

అదానీ, అంబానీ, టాటాల కంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలనేది జగన్ కోరికగా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఐదేళ్ల వైసీపీ కాలంలో ఏపీలో ప్రతి గ్రామాల్లోనూ గంజాయ్ అమ్మకాలు విచ్చల విడిగా సాగుతున్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఇది అతి పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనిపై నియంత్రణ మొదలుపెట్టామన్నారు. ఈ క్రమంలో హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయని పదేపదే చెబుతోంది కూటమి ప్రభుత్వం.

ఈ నేపథ్యంలో సోషల్‌మీడియా చెలరేగిపోతున్న పేటీయం బ్యాచ్‌కి ప్రభుత్వం తరుపున వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. మహిళల మీద అసభ్యకరంగా పోస్టింగులు వేస్తే ప్రభుత్వం తాట తీస్తుందని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. నేరాలను అరికట్టేందుకు వీలైతే శాంతి భద్రతలపై మరో రోజు పొడిగించా లని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. దానికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మొత్తానికి జగన్ ఢిల్లీలో చేసిన ధర్నాకు సీఎం చంద్రబాబు ఈ స్థాయిలో కౌంటర్ ఇస్తారని తాము ఊహించలేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట.

 

 

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×