BigTV English

Chandrababu: మోదీని తెగపొగిడేసిన చంద్రబాబు.. మళ్లీ ఎన్డీయేలోకి?

Chandrababu: మోదీని తెగపొగిడేసిన చంద్రబాబు.. మళ్లీ ఎన్డీయేలోకి?
cbn modi

Chandrababu: “ఎన్డీయేపై ఎలాంటి వ్యతిరేకత లేదు.. ప్రత్యేక హోదా సెంటిమెంట్ వల్లే అప్పట్లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాం.. మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా భారత్‌కు గుర్తింపు.. మోదీ తెస్తున్న మార్పుల వల్లే దేశం ముందుకు”.. ఇదీ చంద్రబాబు మోదీకి ఇచ్చిన కితాబు. ‘టైమ్స్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌: ది నీడ్‌ టు కీప్‌ ఫైటింగ్‌’ అనే అంశంపై జరిగిన సదస్సులో చంద్రబాబు వర్చువల్‌ ప్రసంగంలోని ఆసక్తికర పొలిటికల్ కామెంట్స్ ఇవి.


టీడీపీ మళ్లీ బీజేపీకి దగ్గరవుతోందా? అనే అనుమానం చాలాకాలంగా ఉంది. ఓసారి మోదీతో పెట్టుకుని బాగా డ్యామేజ్ అయ్యారు చంద్రబాబు. కేంద్రంతో గొడవ పడితే ఎట్టా ఉంటాదో రుచి చూశారు. ప్రత్యేక హోదా కోసమే కేంద్రంతో తగాదా అని చంద్రబాబు అంటే.. కేంద్ర బిల్లులపై వివరాలు అడిగితే గగ్గోలు పెట్టారనేది కమలనాథుల వర్షన్. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలో ధర్మపోరాటం పేరుతో ప్రధాని మోదీపై పెద్ద రాజకీయ పోరాటమే చేశారు. మోదీ కంటే తానే సీనియర్ అంటూ ఊదరగొట్టారు. కట్ చేస్తే.. ఎన్నికల్లో ఘోర పరాజయంతో మళ్లీ బీజేపీపై నోరెత్తలేదు చంద్రబాబు.

ఓవైపు జగన్ భారీ మెజార్టీతో గెలిచారు. అధికారంలోకి వచ్చాక టీడీపీని అణిచేయడం స్టార్ట్ చేశారు. ఈ సమయంలో కేంద్రం దన్ను ఉంటే ఆ ధీమానే వేరు. కానీ, చంద్రబాబు చేజేతులారా చేసుకున్న తప్పిదం. చేతులు కాలాక.. నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. మోదీ, బీజేపీలపై విమర్శలు మానేశారు. గడిచిన నాలుగేళ్లుగా ప్రధానిని పల్లెత్తుమాట కూడా అనలేదు. పైగా పొగుడుతున్నారు కూడా. చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు.. ఎందుకో అందరికీ తెలిసిందే.


అయితే, కమలనాథులు మాత్రం చంద్రబాబును అంత ఈజీగా దగ్గరకు తీసుకోవడం లేదు. గత చేదు అనుభవాన్ని మర్చిపోవడం లేదు. వారిద్దరి మధ్య సఖ్యతకు జనసేనాని ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఆ బంధం బలపడటం లేదు. వైసీపీతో కమలదళం రహస్య స్నేహం చేస్తోందనే ప్రచారం ఉంది. బలంగా ఉన్న జగన్‌ను వదిలేసి.. చంద్రబాబుతో చేతులు కలిపేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు లేదు. అందుకే, పవన్ ప్రయత్నాలు కూడా వృధాప్రయాసలుగానే మిగిలుతున్నాయి. అయినా, చంద్రబాబు మాత్రం కేంద్రానికి ప్రేమలేఖలు రాయడం ఆపడం లేదు. పలు అంశాలపై లేఖలు రాస్తూ.. నేనున్నానంటూ గుర్తు చేస్తున్నారు. ఇటీవల ఓ అఫిషియల్ మీటింగ్‌లో మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చినందుకే తెగ ఖుషీ అయ్యారు. లేటెస్ట్ ఈవెంట్‌లోనూ మోదీని పొగడ్తల వర్షంలో ముంచెత్తుతూ.. ఎన్డీయేపై తనకేమీ వ్యతిరేకత లేదని చాటిచెబుతూ.. బీజేపీతో దోస్తీకి చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారని అంటున్నారు. మరి, కమలనాథులు బాబు మొర ఆలకించేనా? ఆయనతో కలిసొచ్చేనా?

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×