EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu: చేయరాని నేరాలు చేశారు.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు : చంద్రబాబు

Chandrababu: చేయరాని నేరాలు చేశారు.. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు : చంద్రబాబు

AP CM Chandrababu Comments on Jagan: గత వైసీపీ ప్రభుత్వంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలు జిల్లా పుచ్చకాయలమడలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైఎస్ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను రూ. 4 వేలకు పెంచాం. అధికారులు ప్రతి నెలా ఒకటో తేదీన మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇదే విధంగా భవిష్యత్ లో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. గత వైసీపీ పాలనలో ఉద్యోగులకు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేదు. కానీ, కూటమి పాలనలో అలాంటి సమస్యే లేదు. వారికి ప్రతి నెలా జీతాలు, పెన్షన్లను చెల్లిస్తున్నాం.

Also Read: సనాతన ధర్మంపై ఈ డిప్యుటీ సీఎమ్‌లు తలోదారి, హీరోలే గానీ.. ఆ విషయంలో మాత్రం…


రాయలసీమను అభివృద్ది చేసి తీరుతాం. ఈ ప్రాంతాన్ని గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతాం. వర్క్ ఫ్రమ్ హోమ్ కు శ్రీకారం చుట్టాలనుకుంటున్నాం. గ్రామాల్లో వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాం. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడంతో రాయలసీమ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసే అవకాశం మీకు కలుగుతుంది’ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

‘మళ్లీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేశాం. వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపంగా మారాయి. వైసీపీ దౌర్జన్యాలకు పెట్టుబడిదారులు పారిపోయారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేకుండా చేశారు. వైసీపీ చేసిన తప్పిదాలు ఇంకా వెంటాడుతున్నాయి. పాసు పుస్తకాల మీద కూడా వాళ్ల బొమ్మలు వేసుకున్నారు. మళ్లీ మన ప్రభుత్వం వచ్చాక పట్టా పాసు పుస్తకాల మీద రాజముద్ర తీసుకొచ్చాం. అన్న క్యాంటీన్లను మూసివేశారు. గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. చేయరాని నేరాలు చేశారు.. రాష్ట్రాన్ని దోచుకున్నారు. రాష్ట్ర ఖజానాను పూర్తిగా దోచుకెళ్లారు’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Also Read: పెట్టిన పంగనామాలు చాలు ఇక… పాలనపై దృష్టి పెట్టండి

‘గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించింది. గతంలో సీఎం మీటింగ్ ఉందంటే చాలు ప్రజలకు నరకం కనిపించేది. ఆయన కోసం అధికారులు పరదాలు కట్టేవారు.. చెట్లను నరికేసేవారు. మొత్తం పరిస్థితి దారుణంగా ఉండేది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. వారి ఐదేళ్ల పాలనలో ఒక్క ఎకరానికి సాగు నీరందించలేదు. ప్రభుత్వానికి ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. రీ సర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులను పూర్తిగా చెరిపివేశారు. వైసీపీ నేతలు ఇష్టానుసారంగా పేదల భూములను ఆక్రమించుకున్నారు. అందుకే ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేశాం’ అని ఏపీ సీఎం అన్నారు.

Related News

Home Minister: కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా?.. అయితే ఈ శుభవార్త తెలుసా..?

Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

YS Jagan Mohan Reddy: తిరుమల భక్తులపై జగన్ ప్రభుత్వం కుట్ర?

Ysrcp Seats : చట్టసభల్లో వైసీపీ బలమెంత… ఇప్పటికీ జగన్‌దే పైచేయా?

Prakash Raj: పెట్టిన పంగనామాలు చాలు ఇక… పాలనపై దృష్టి పెట్టండి: ప్రకాష్ రాజ్

Sanatahana Dharma : సనాతన ధర్మంపై ఈ డిప్యుటీ సీఎమ్‌లు తలోదారి, హీరోలే గానీ.. ఆ విషయంలో మాత్రం…

Big Stories

×