EPAPER

Chandrababu Comments: మాజీమంత్రిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Chandrababu Comments: మాజీమంత్రిపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

chandrababu hot comments on ex minister anilkumar yadav


Chandrababu Hot Comments: ఏపీలో ఎలక్షన్‌ల సమయం సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయ నేతలంతా ప్రజలను ఆకట్టుకునేందుకు తమ తమ వ్యూహాలను రచిస్తున్నారు. అధికార పార్టీ సహా..ప్రతిపక్ష పార్టీలన్ని ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకు రాజకీయంగా వ్యూహాలను రచిస్తున్నారు. ఇందుకోసం మరింత డోస్‌ని పెంచేందుకు సినీనటి సమంతను రంగంలోకి దించినట్టు తెలుస్తోంది.

ఇక తాజాగా.. వైసీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు. ఇక్కడ ఓ నాయకుడు ఉండేవాడని, ఆయన నెల్లూరు నడివీధిలో ఎగిరెగిరి పడ్డారని మండిపడ్డారు. ఆయన మంత్రి అయ్యాక ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదని, కన్ను మిన్నూ కనపడకుండా ప్రవర్తించారని, అది మన కర్మ అలాంటి వాడు కూడా మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో చేరిక అయ్యారు.

ఈ మీటింగ్‌లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మొన్న జరిగిన బదిలీలో ఒక్కతన్ను తంతే.. పక్క జిల్లా కూడా కాదు. మూడు జిల్లాల అవతలి వైపు పడిపోయాడని ఎద్దేవా చేశారు. ఆయన ఒకప్పుడు బుల్లెట్ దిగిందా.. అని భారీ డైలాగులు కొట్టేవాడని.. ఇప్పుడు ఆయనకే బుల్లెట్ గట్టిగా దిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు పల్నాడులో బుల్లెట్ దిగాక.. మళ్లీ తిరుగు తపాళాలో చెన్నై వెళ్లి పడతాడని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Read More: వైసీపీకి వరుస షాక్‌లు.. టీడీపీలోకి వసంత, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

ఇక ఇదిలా ఉంటే మరోపక్కా..జగన్ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అందుకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌తో కలిసి 2024లో ఏపీలో జరగబోయే ఎలక్షన్‌లో ఎలాగైనా రాజకీయ పగ్గాలను చేజిక్కించుకునేందుకు వరుసగా పబ్లిక్‌ మీటింగ్‌లను పెడుతున్నారు.

ఈ సభలో జగన్‌ ప్రభుత్వంపై వరుసగా పవన్‌, చంద్రబాబులు మాటల తూటాలను పేల్చుతున్నారు. అంతేకాకుండా ఈ ఇరు పార్టీల పొత్తుతో జగన్ సర్కార్‌కి ఓటమి ముప్పు తప్పదని కొంతమంది రాజకీయ వక్తలు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రజల నాడిని లెక్కించడం కొంత కష్టమనే చెప్పాలి. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ ఎలక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో..

 

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×