EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu Called Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు!

Chandrababu Called Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు!

Chandrababu called to Former CM Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు ఇప్పటికే చంద్రబాబు ఆహ్వానం పంపారు. ఇటు మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి.. ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే, జగన్ తో మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం.


కాగా, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. దాదాపు 175 వరకు సీట్లు వస్తాయని ఆశపడిన జగన్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఫలితాల తరువాత మీడియా ముందుకు వచ్చిన జగన్.. 11 సీట్లకే పరిమితం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు సమాచారం.

ఇటు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తియినట్లు తెలుస్తోంది. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.


Also Read: మన రాజధాని అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు

వీఐపీలో కోసం నాలుగు ప్రత్యేక గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరీని.. మొత్తం ఐదు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 2 లక్షల మంది వరకు రావొచ్చంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం జాతీయ రహదారి పక్కనే నిర్వహిస్తున్న తరుణంలో హైవేపై పలు ఆంక్షలు కూడా విధించారు.

ఇదిలా ఉంటే.. నేడు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముందుగా చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా కూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Related News

Jagan clarification: మళ్లీ బెంగుళూరుకి జగన్.. పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Big Stories

×