EPAPER

Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. జనవరి 19కి వాయిదా

Chandrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. జనవరి 19కి వాయిదా

Chandrababu Bail: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జనవరి 19కు వాయిదా పడింది. ఈ పిటిషన్ పై గతంలోనే వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం పిటిషన్ పై మరోసారి విచారణ చేపట్టింది.


స్కిల్ కేసులో 17 ఏ వ్యవహారంపై ఇప్పటికీ తీర్పు రాలేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానిపై తీర్పు ఇస్తే మాత్రం వాయిదా వేయాలని లాయర్ హరీష్ సాల్వే కోరారు. వాయిదా వేయకపోతే విచారణ తేదీ చెప్పాలని కోరగా.. నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు తాము సిద్ధమేనని హరీష్ సాల్వే తెలిపారు. ఇదే సమయంలో ఈ అంశం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందని హరీష్ సాల్వే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

హరీష్ సాల్వే వాదనతో ఏకీభవించిన కోర్టు.. విచారణను జనవరి మూడో వారంలో చేపడుతామని తెలిపింది. ఏ తేదీన విచారిస్తారో చెప్పాలని ధర్మాసనాన్ని కోరగా.. జనవరి 19కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఈ లేగా కౌంటర్ దాఖలు చేయాలని హరీష్ సాల్వేను ఆదేశించింది.


Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×