EPAPER

Challa Family Politics : చల్లా కుటుంబంలో రాజకీయ మంటలు..వారతసత్వం కోసం వర్గ పోరు..

Challa Family Politics : దివంగత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు ఆ కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేస్తున్నాయా…? అవుననే అంతా చెబుతున్నారు.

Challa Family Politics : చల్లా కుటుంబంలో రాజకీయ మంటలు..వారతసత్వం కోసం వర్గ పోరు..

Challa Family Politics : దివంగత నేత చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబంలో విభేదాలు ఆ కుటుంబాన్ని రాజకీయాలకు దూరం చేస్తున్నాయా…? అవుననే అంతా చెబుతున్నారు. ఒకప్పుడు కర్నూల్ జిల్లాల్లో చల్లా పేరుతోనే నడిచే రాజకీయాల్లో ఆయన మరణం తర్వాత భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబంలో అధిపత్య పోరు పీక్స్‌కు చేరుకోని… యావత్ కుటుంబ రాజకీయ గౌరవానికి భంగం కలిగించిందని అంతా అనుకుంటున్నారు. అసలు చల్లా కుటుంబంలో ఏం జరుగుతోంది…?


ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కుటుంబం అది. అలాంటి కుటుంబంలో ఆ పెద్దాయన అకాల మృతితో వర్గ విభేదాలతో నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు. తండ్రి మరణం తర్వాత కొడుకు మరణంతో నిత్యం ఆ కుటుంబంలో వర్గపోరు పీక్స్‌కి వెళ్లింది. బావ మరదళ్ల మధ్య నిత్యం ఆస్తులు, పదవుల కోసం వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రజలు తమ నేత కుటుంబంలో వర్గపరును చూస్తూ ఓర్చుకోలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. చల్లా భవన్ ఇప్పుడూ వివాదాల భవన్‌గా మారిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

1983లో ఎమ్మెల్యేగా…. రాయలసీమలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్‌గా… కవిగా… కళాకారుడుగా… పేరుపొందిన నేత చల్లా రామకృష్ణ రెడ్డి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చల్లా అంటే చాలు… ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా నడిచింది. అలాంటి రోజుల నుంచి ఇప్పుడు భిన్నంగా ప్రజలు తమ కుటుంబం గురించి పలు రకాలుగా మాట్లాడుకుంటారనే టాక్ వినిపిస్తోంది. చల్లా రామకృష్ణారెడ్డి ప్రభావం ఇప్పటికీ గ్రామపంచాయతీ ఎన్నికలు మొదలుకొని శాసనసభ ఎన్నికల్లోనూ ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అవుకు పరిసర ప్రాంతాల్లో… ఉండా మండలాల్లోనే కాక, ఉప్పలపాడు, జున్నుంతల, కొండం, నాయిని పల్లె వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ చెల్లాకు తిరుగులేని ఓటు బ్యాంకు ఉందని చెబుతుంటారు. అయితే, ఇప్పుడు చల్లా కుటుంబంలో జరుగుతున్న వర్గ విభేదాల వల్ల అలాంటి ప్రాంతాల్లో కూడా కేడర్ చేయి జారిపోతుందా అన్న టెన్షన్ మొదలైందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.


నంద్యాల జిల్లా అవుకులో చల్లా రామకృష్ణ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన చల్లా రామకృష్ణారెడ్డి ఇటీవల కరోనా సమయంలో మృతి చెందారు. కాగా, ఆ పదవిని తన కుమారుడైన భగీరథ రెడ్డికు కేటాయించారు. అయితే, భగీరద రెడ్డి కూడా తన తండ్రి మరణించిన సంవత్సరం తర్వాత మృతిచెందారు. దీనితో చల్లా కుటుంబం నుండి ఎమ్మెల్సీ పదవి చేజారింది. పార్టీ అధిష్టానం కూడా చల్లా కుటుంబ కలహాలతో విసిగిపోయి, ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. కాగా, భగీరథ రెడ్డి భార్య చల్లా శ్రీలక్ష్మి అవుకు జెడ్పీటీసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భర్త మరణంతో చెల్లా శ్రీలక్ష్మి తన కంటూ ఒక కేడర్‌ను ఏర్పాటు చేసుకొని, ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరిగారు. ఆమె మామ చల్లా రామకృష్ణారెడ్డి, భర్త భగీరథ రెడ్డి చేసిన సేవలను ప్రజలకు గుర్తుండేలా పార్టీ అధిష్టానం కూడా ఆమెకు సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, రానున్న రోజుల్లో కూడా శ్రీలక్ష్మికి పలు పదవులు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం.

అయితే, చల్లా జడ్పిటిసి పదవి చేపట్టినప్పటి నుంచి భగీరథ రెడ్డి సోదరుడు విఘ్నేశ్వర రెడ్డి ఆస్తుల పంపకాల విషయంలో తరచూ గొడవలు పడుతుంటారని స్థానికంగా ప్రచారం ఉంది. అయితే, కుటుంబంలో జరిగిన చిన్నపాటి గొడవ కూడా రోడ్డు మీదకు వచ్చి రచ్చకెక్కిన సంఘటనలు చల్లా కుటుంబంలో సాధరణంగా మారాయి. గతంలో శ్రీలక్ష్మి… తన బావ, అత్త తమను రాజకీయంగా పదవుల కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. కాగా, అవుకు ప్రాంతంలో మొదలైన ఈ కుటుంబ తగాదాలు ఇప్పుడు శ్రీలక్ష్మి సొంత జిల్లా అయిన అనంతపురంలో కూడా ముదిరినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం, చల్లా కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫొటో ఫ్రేమ్‌ కోసం మొదలైన గొడవ పెద్ద గాలివానలా మారిందని.. ఆ తర్వాత ఆస్తి, రాజకీయ వారసత్వం ఇలా కొత్త విషయాలు తెరపైకి వచ్చాయనే చర్చలు జరిగాయి. అత్తా కోడలి మధ్య గొడవలోకి ఆడపడుచు ఎంట్రీ అవ్వడంతో కథ మరో మలుపు తిరిగిందని చెబుతారు. ప్రస్తుతం, చల్లా కుటుంబం రెండుగా చీలిపోయిందనేది స్పష్టం. ఇప్పుడు పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. తాజాగా, ఇంటి దగ్గర కారు పార్కింగ్ విషయంలో, పిల్లల విషయంలో ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గాయాలతో బనగానపల్లి ఆసుపత్రిలో చల్లా శ్రీలక్ష్మి, అవుకు ఆసుపత్రిలో చల్లా శ్రీదేవి చేరారు.

అయితే, చల్లాకు నియోజకవర్గంలో ఉన్న పలుకుబడిని పార్టీ అధిష్టానం కోల్పోకూడదని అనుకుంటుంది. దాని కోసం చల్లా కుటుంబ సభ్యులందర్నీ ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు స్థానికి నేతలు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే, తీవ్రంగా గొడవలు పడుతున్నకుటుంబ సభ్యులు ఒకే వేదికపై ఉంటారా లేదా అన్నది డౌటుగానే ఉంది. ఈ వివాదాలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో చల్లా కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా అనే ప్రశ్న కూడా పార్టీ కేడర్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో పార్టీ అధిష్టానం కొత్తవారికి అవకాశం కల్పిస్తుందనే టాక్ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుందో అని పార్టీ కార్యకర్తలు కూడా వేచి చూస్తున్నారు.

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×